Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 102

జడ్జి దొంగతో: “నువ్వు సిగ్గుపడాలయ్యా! నీ జన్మకు అర్ధముందా? ఈ భూమికి నువ్వు భారంగా ఉన్నావు” అన్నాడు. దొంగ: అంత తక్కువ చెయ్యకండి సార్‌! మా వల్లనే వేలమంది పోలీసులు బతుకుతున్నారు. అసలీ కోర్టులు, మీరు, మేము లేకుండా ఉండేవాళ్ళా? ——————————————————- టీచర్‌: కాళిదాసు ఎవరో తెలుసా? స్టూడెంట్‌: దేవదాసు వాళ్ళ అన్న ——————————————————- ఒక పెద్దమనిషి బస్‌స్టాప్‌లో పక్కనున్నతన్తో “ఆ అబ్బాయి మీ అబ్బాయా?” “అతను మా అబ్బాయి కాదు, మా అమ్మాయి” “సారీ సర్‌! […]

జడ్జి దొంగతో: “నువ్వు సిగ్గుపడాలయ్యా! నీ జన్మకు అర్ధముందా? ఈ భూమికి నువ్వు భారంగా ఉన్నావు” అన్నాడు.
దొంగ: అంత తక్కువ చెయ్యకండి సార్‌! మా వల్లనే వేలమంది పోలీసులు బతుకుతున్నారు. అసలీ కోర్టులు, మీరు, మేము లేకుండా ఉండేవాళ్ళా?
——————————————————-
టీచర్‌: కాళిదాసు ఎవరో తెలుసా?
స్టూడెంట్‌: దేవదాసు వాళ్ళ అన్న
——————————————————-
ఒక పెద్దమనిషి బస్‌స్టాప్‌లో పక్కనున్నతన్తో
“ఆ అబ్బాయి మీ అబ్బాయా?”
“అతను మా అబ్బాయి కాదు, మా అమ్మాయి”
“సారీ సర్‌! మీరు ఆ అమ్మాయి ఫాదరనుకోలేదు”
“నేను ఆ అమ్మాయి ఫాదర్‌ని కాను, మదర్ని”
——————————————————-
పిచ్చాసుపత్రికి ఒక విజిటర్‌ వచ్చాడు.
ఒక గదిలో ఉన్న పిచ్చివాణ్ణి చూసి “ఏమిటి ఇతని కథ” అని అడిగాడు.

“ఒకమ్మాయిని ప్రేమించాడు. ఆమె ఇతని ప్రేమని తిరస్కరించింది”
పక్కగదిలో ఇంకో పిచ్చివాణ్ణి చూసి “ఇతని సంగతేమిటి?” అన్నాడు.
“ఆ అమ్మాయి ఇతని ప్రేమని అంగీకరించింది. ఫలితం ఇది”

First Published:  2 Jun 2015 1:03 PM GMT
Next Story