Telugu Global
Others

జయ కేసులో అప్పీల్‌కు వెళ్లనున్న కర్ణాటక

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని కింది కోర్టు విధించిన శిక్షను బెంగళూరు హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించనుంది. జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ఇంత‌టితో […]

జయ కేసులో అప్పీల్‌కు వెళ్లనున్న కర్ణాటక
X
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని కింది కోర్టు విధించిన శిక్షను బెంగళూరు హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించనుంది. జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ఇంత‌టితో వ‌ద‌ల‌కూడ‌ద‌ని, సుప్రీంకోర్టుకు వెళ్ళ‌డం ద్వారా హైకోర్టు నిర్ల‌క్ష్యం చేసిన విష‌యాల‌ను సుప్రీంలో ప్ర‌స్తావించి కేసును తిర‌గ‌దోడాల‌ని క‌ర్ణాట‌క పీపీ తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు.
First Published:  1 Jun 2015 3:54 AM GMT
Next Story