Telugu Global
Cinema & Entertainment

టీజర్ తో అదరగొట్టిన బాహుబలి

అనుకోని విధంగా బాహుబలి ఆడియో రిలీజ్ వాయిదాపడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు (మే 31) బాహుబలి పాటల వేడుక జరగాలి. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదాపడింది. దీంతో అభిమానులు నిరాశచెందారు. ఫ్యాన్స్ ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో రాజమౌళి మరో కొత్త ప్లాన్ వేశాడు. టీజర్ మరియు ట్రయిలర్ రిలీజ్ తేదీల్ని ప్రకటించి ఉత్సాహం నింపాడు. అనుకున్నట్టుగానే బాహుబలి టీజర్ ను విడుదల చేశాడు రాజమౌళి. నటీనటులెవ్వర్నీ పరిచయం చేయకపోయినప్పటికీ.. ప్రధాన […]

టీజర్ తో అదరగొట్టిన బాహుబలి
X
అనుకోని విధంగా బాహుబలి ఆడియో రిలీజ్ వాయిదాపడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు (మే 31) బాహుబలి పాటల వేడుక జరగాలి. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదాపడింది. దీంతో అభిమానులు నిరాశచెందారు. ఫ్యాన్స్ ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో రాజమౌళి మరో కొత్త ప్లాన్ వేశాడు. టీజర్ మరియు ట్రయిలర్ రిలీజ్ తేదీల్ని ప్రకటించి ఉత్సాహం నింపాడు.

అనుకున్నట్టుగానే బాహుబలి టీజర్ ను విడుదల చేశాడు రాజమౌళి. నటీనటులెవ్వర్నీ పరిచయం చేయకపోయినప్పటికీ.. ప్రధాన తారాగణమైన ప్రభాస్, రానా క్యారెక్టర్లను చూపిస్తూ.. యుద్ధరంగం సెట్ తో బాహుబలి టీజర్ విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ టీజర్ కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. ఇదే ఊపుతో రేపు (జూన్ 1) బాహుబలి ట్రయిలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ట్రయిలర్ విడుదలైన తర్వాత సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశముంది.

First Published:  31 May 2015 1:38 AM GMT
Next Story