Telugu Global
Others

లక్ష్మీపార్వతి ఇంటి వాచ్‌మన్‌ అనుమానాస్పద మృతి

వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నివాసంలో వాచ్‌మన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీపార్వతి నివాసంలో ఏడాది కాలంగా పనిచేస్తున్న రాజు.. భార్య, కుమార్తెతో కలిసి ఆమె ఇంటి వెనక కాలనీలోని ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఇదే ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న స్వామి, రాజుల మధ్య నెలరోజులుగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజు భార్య, కుమార్తె శుక్రవారం బయటకెళ్లి వచ్చేసరికి రాజు ఉరి వేసుకుని కనిపించాడు. స్వామే.. రాజును ఉరివేసి చంపాడంటూ స్థానికులు ఆరోపించారు. పోలీసులు మృత […]

లక్ష్మీపార్వతి ఇంటి వాచ్‌మన్‌ అనుమానాస్పద మృతి
X
వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నివాసంలో వాచ్‌మన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీపార్వతి నివాసంలో ఏడాది కాలంగా పనిచేస్తున్న రాజు.. భార్య, కుమార్తెతో కలిసి ఆమె ఇంటి వెనక కాలనీలోని ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఇదే ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న స్వామి, రాజుల మధ్య నెలరోజులుగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజు భార్య, కుమార్తె శుక్రవారం బయటకెళ్లి వచ్చేసరికి రాజు ఉరి వేసుకుని కనిపించాడు. స్వామే.. రాజును ఉరివేసి చంపాడంటూ స్థానికులు ఆరోపించారు. పోలీసులు మృత దేహాన్ని తరలించే సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు స్వామిని అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
First Published:  29 May 2015 1:20 PM GMT
Next Story