Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 98

ఒక ధనవంతుడు చనిపోయాడు. నరకానికి వచ్చాడు. “నేను పుణ్యం చేశా”నని చిత్రగుప్తునితో వాదనకు దిగాడు. ఏం పుణ్యం చేశావో చెప్పమన్నాడు చిత్రగుప్తుడు. “ఒక అనాథ బాలుడికి పావలా దానం చేశాను”, “ఒక ముసలి బిచ్చగాడికి పావలా ఇచ్చాను”, “ఒక గుడ్డివానికి పావలా ఇచ్చాను” అన్నాడు గర్వంగా. చిత్రగుప్తుడు తన దగ్గరున్న చిల్లరలోంచి డెబ్బయి  ఐదు పైసలు తీసి అతని చేతిలో పెట్టి యమభటుల్ని చూసి “వీణ్ణి తీసుకెళ్ళి నూనెలో వేయించండి” అన్నాడు. —————————- అతను సైకియాట్రిస్ట్‌ దగ్గరికి […]

ఒక ధనవంతుడు చనిపోయాడు. నరకానికి వచ్చాడు. “నేను పుణ్యం చేశా”నని చిత్రగుప్తునితో వాదనకు దిగాడు. ఏం పుణ్యం చేశావో చెప్పమన్నాడు చిత్రగుప్తుడు.
“ఒక అనాథ బాలుడికి పావలా దానం చేశాను”, “ఒక ముసలి బిచ్చగాడికి పావలా ఇచ్చాను”, “ఒక గుడ్డివానికి పావలా ఇచ్చాను” అన్నాడు గర్వంగా.
చిత్రగుప్తుడు తన దగ్గరున్న చిల్లరలోంచి డెబ్బయి ఐదు పైసలు తీసి అతని చేతిలో పెట్టి యమభటుల్ని చూసి “వీణ్ణి తీసుకెళ్ళి నూనెలో వేయించండి” అన్నాడు.
—————————-
అతను సైకియాట్రిస్ట్‌ దగ్గరికి వెళ్ళాడు.
“నాకు మూడు రాత్రుల నించీ క్రికెట్‌ ఆడుతున్నట్లు కలలొస్తున్నాయి?”
“మీకు అమ్మాయిల గురించి కలలు రావా?”
“నేను క్రికెట్‌ ఆడుతున్నది వాళ్లతోనే కదా!”
—————————-
“నరేష్‌! నువ్వు విలేజ్‌కి వెళ్ళావు కదా! నీ అనుభవం చెప్పు”
“టీచర్‌! అక్కడ చాలా గ్రీనరీ ఉంది. మనం డబ్బులు దాచుకునే పిగ్గీబ్యాంక్‌లు పెద్దవీ చిన్నవీ ఎక్కడ పడితే అక్కడ అటూ ఇటూ తిరుగుతున్నాయి”
—————————————
“నేను స్టేజ్‌ యాక్టర్‌గా రాణించాలనుకుంటున్నాను. కొలంబస్‌ అంత వాణ్ణవుతాను”
“కొలంబస్‌ నావికుడు”
“నా ఇష్టమొచ్చింది నేనవుతాను. మధ్యలో నీ అభ్యంతరమేమిటి?”

First Published:  29 May 2015 1:03 PM GMT
Next Story