Telugu Global
Others

హెచ్‌.ఎంటీ బేరింగ్స్ ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో వీఆర్ఎస్‌

ఖాయిలా ప‌డిన‌ కంపెనీల్లో ఉన్న 2,800 మంది ఉద్యోగులకు త్వ‌రలో విఆర్‌ఎస్‌ ఇవ్వనున్నట్టు భారీ పరిశ్రమల మంత్రి అనంత్‌ గీతే తెలిపారు. వీరికి జీతాలు 1997 స్కేల్స్‌ ప్రకారం ఇస్తుండగా విఆర్‌ఎస్‌ మాత్రం 2007 స్కేల్స్‌ ప్రకారం ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు. ఖాయిలా పడిన ఐదు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను విక్రయించడం ద్వారా 22 వేల కోట్ల రూపాయలను సమీకరించనున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ప్రభుత్వం ఈ అమ్మకాల తంతు పూర్తి […]

ఖాయిలా ప‌డిన‌ కంపెనీల్లో ఉన్న 2,800 మంది ఉద్యోగులకు త్వ‌రలో విఆర్‌ఎస్‌ ఇవ్వనున్నట్టు భారీ పరిశ్రమల మంత్రి అనంత్‌ గీతే తెలిపారు. వీరికి జీతాలు 1997 స్కేల్స్‌ ప్రకారం ఇస్తుండగా విఆర్‌ఎస్‌ మాత్రం 2007 స్కేల్స్‌ ప్రకారం ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు. ఖాయిలా పడిన ఐదు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను విక్రయించడం ద్వారా 22 వేల కోట్ల రూపాయలను సమీకరించనున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ప్రభుత్వం ఈ అమ్మకాల తంతు పూర్తి చేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని పూర్తిగా మూలపడ్డాయనీ అలాంటి వాటిలో ఐదు కంపెనీలను ఎంపిక చేసి అమ్మివేసేందుకు నిర్ణయించామని గీతే చెప్పారు. అమ్మకానికి నిర్ణయించిన కంపెనీల్లో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న హెచ్‌ఎంటి బేరింగ్స్‌, హిందుస్తాన్‌ కేబుల్‌ కార్పొరేషన్‌ కూడా ఉన్నాయి. మూతవేసి విక్రయించాలని నిర్ణయించిన ఐదు కంపెనీల ఆస్తుల విలువ సుమారు 22,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. వీటిని మూతవేయడానికయ్యే ఖర్చు 1,400 కోట్ల రూపాయలని, విక్రయిస్తే వచ్చే మొత్తం 22,000 కోట్ల రూపాయలని ఆయన వివరించారు.
First Published:  29 May 2015 1:30 PM GMT
Next Story