మన మొక్కలతో మధుమేహ నియంత్రణ
భారత దేశంలో లభించే కొన్ని రకాల మొక్కలు మధుమేహ నియంత్రణకు దివ్యౌషధమని తాజా పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు కేన్సర్ చికిత్సలోనూ ఇవి మెరుగైన ఫలితాన్నిస్తాయని అస్ట్రేలియాలో పరిశోధన చేస్తున్న భారత సంతతికి చెందిన డాక్టర్ వందనా గులాటి పేర్కొన్నారు. పీహెచ్‌డీ పరిశోధనలో భాగంగా.. భారత్, ఆస్ట్రేలియాలో లభ్యమయ్యే పలు రకాల మొక్కలపై పరిశోధన కొనసాగించినట్లు తెలిపారు. వీటిలో 12 రకాల ఆయుర్వేద మొక్కలకు మధుమేహ నియంత్రణ గుణాలు ఉన్నట్లు తేలిందన్నారు. శరీరం గ్లూకోజ్ స్వీకరించే విధానాన్ని, పేరుకుపోతున్న […]
BY Pragnadhar Reddy28 May 2015 1:09 PM GMT

X
Pragnadhar Reddy28 May 2015 1:09 PM GMT
భారత దేశంలో లభించే కొన్ని రకాల మొక్కలు మధుమేహ నియంత్రణకు దివ్యౌషధమని తాజా పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు కేన్సర్ చికిత్సలోనూ ఇవి మెరుగైన ఫలితాన్నిస్తాయని అస్ట్రేలియాలో పరిశోధన చేస్తున్న భారత సంతతికి చెందిన డాక్టర్ వందనా గులాటి పేర్కొన్నారు. పీహెచ్‌డీ పరిశోధనలో భాగంగా.. భారత్, ఆస్ట్రేలియాలో లభ్యమయ్యే పలు రకాల మొక్కలపై పరిశోధన కొనసాగించినట్లు తెలిపారు. వీటిలో 12 రకాల ఆయుర్వేద మొక్కలకు మధుమేహ నియంత్రణ గుణాలు ఉన్నట్లు తేలిందన్నారు. శరీరం గ్లూకోజ్ స్వీకరించే విధానాన్ని, పేరుకుపోతున్న కొవ్వుపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు. కాలీ మస్లి, విజయ్‌సర్, కాల్‌మేగ్ తదితర మొక్కలు ఆయా వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయని వందన వివరించారు.
Next Story