Telugu Global
Others

ప్రధాని మోదీతో మన్మోహన్ సింగ్ భేటీ

మౌనమునిగా పేరొందిన మాజీ ప్రధాని మన్మోహన్‌… ఒక‌వైపు… మాటలతో మంత్ర ముగ్ధుల్ని చేసే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మ‌రోవైపు… ఇద్ద‌రూ ఎదురెదురుగా కూర్చుని ప‌ల‌క‌రించుకుంటే ఎలా ఉంటుంది. ఈ అనుభ‌వ‌మే బుధ‌వారం 7-రేస్‌కోర్స్ రోడ్డులో ఇద్ద‌రూ పంచుకున్నారు. మామూలుగా అయితే ఒకరి పాలనపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. కానీ… బుధవారం మోడీ, మన్మోహన్ దీనికి భిన్నంగా క‌లిసి కూర్చుని మాట్లాడుకున్నారు. మోదీ పిలుపు మేరకు మన్మోహన్‌.. 7 రేస్‌ కోర్స్‌ రోడ్‌కు వెళ్లారు. ‘కలిసి మాట్లాడుకుందాం. […]

ప్రధాని మోదీతో మన్మోహన్ సింగ్ భేటీ
X
మౌనమునిగా పేరొందిన మాజీ ప్రధాని మన్మోహన్‌… ఒక‌వైపు… మాటలతో మంత్ర ముగ్ధుల్ని చేసే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మ‌రోవైపు… ఇద్ద‌రూ ఎదురెదురుగా కూర్చుని ప‌ల‌క‌రించుకుంటే ఎలా ఉంటుంది. ఈ అనుభ‌వ‌మే బుధ‌వారం 7-రేస్‌కోర్స్ రోడ్డులో ఇద్ద‌రూ పంచుకున్నారు. మామూలుగా అయితే ఒకరి పాలనపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. కానీ… బుధవారం మోడీ, మన్మోహన్ దీనికి భిన్నంగా క‌లిసి కూర్చుని మాట్లాడుకున్నారు. మోదీ పిలుపు మేరకు మన్మోహన్‌.. 7 రేస్‌ కోర్స్‌ రోడ్‌కు వెళ్లారు. ‘కలిసి మాట్లాడుకుందాం. తేనీటి విందుకు రండి’ అంటూ మన్మోహన్‌కు ఆహ్వానం పంపించారు. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు మోడీతో భేటీ అయ్యారు. ‘డాక్టర్‌ మన్మోహన్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. 7 రేస్‌కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసంలోకి ఆయనకు పునః స్వాగతం’ అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ భేటీలో మోడీ పాలనపై విమ‌ర్శ‌లు కురిపించిన కాసేపటికే మన్మోహన్‌ స్వయంగా ఆయనతో భేటీ కావడం విశేషం!
First Published:  27 May 2015 1:15 PM GMT
Next Story