Telugu Global
Others

పెళ్లి మండపంలో రక్తదానం..

పెళ్లి మండపంలో రక్తదానం ఉండడం ఏంటీ? అనుకుంటున్నారా? అవును తన వివాహం వినూత్నంగా జరగాలని… అందరికీ ఉపయోగడే విధంగా ఉండాలని ఓ వ్యక్తి ఆలోచించాడు. తన పెళ్లికి వచ్చేవాళ్లు రక్తదానం చేసేందుకు వీలుగా పెళ్లి మండపంలోనే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. తన పెళ్లికి వచ్చేవాళ్లు ఎవరూ బహుమతులు, కట్నాలు, కానుకలు తీసుకురావద్దని వీలైతే రక్తదానం చేయాలని బంధువులు, మిత్రులకు పెళ్లి కుమారుడు ప్రకాష్‌ విజ్ఞప్తి చేశాడు. దీనికి స్పందించిన పలువురు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. […]

పెళ్లి మండపంలో రక్తదానం ఉండడం ఏంటీ? అనుకుంటున్నారా? అవును తన వివాహం వినూత్నంగా జరగాలని… అందరికీ ఉపయోగడే విధంగా ఉండాలని ఓ వ్యక్తి ఆలోచించాడు. తన పెళ్లికి వచ్చేవాళ్లు రక్తదానం చేసేందుకు వీలుగా పెళ్లి మండపంలోనే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. తన పెళ్లికి వచ్చేవాళ్లు ఎవరూ బహుమతులు, కట్నాలు, కానుకలు తీసుకురావద్దని వీలైతే రక్తదానం చేయాలని బంధువులు, మిత్రులకు పెళ్లి కుమారుడు ప్రకాష్‌ విజ్ఞప్తి చేశాడు. దీనికి స్పందించిన పలువురు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రక్తదానం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయని గ్రామాల్లో రక్తదానం చేసేందుకు భయపడేవారికి ఆదర్శంగా ఉండేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పెళ్లికొడుకు ప్రకాష్‌ పేర్కొన్నాడు. ప‌ది మందికీ ఉప‌యోగ‌ప‌డే ఇలాంటి విత‌ర‌ణ‌ను ప్రోత్స‌హించాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.
First Published:  27 May 2015 1:36 PM GMT
Next Story