Telugu Global
Cinema & Entertainment

పవన్ కొత్త సినిమాపై పుకార్లు

త్వరలోనే గబ్బర్ సింగ్-2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు పవన్. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. దాసరి నారాయణరావుతో చేయబోతున్న సినిమానే ఇప్పుడు నెట్ లో బాగా పాపులర్ అయింది. ఈ సినిమాకి కల్కి అనే టైటిల్ పెట్టారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు ఊతమిస్తూ.. దాసరి కూడా తన బ్యానర్ పై కల్కి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు పవన్ […]

పవన్ కొత్త సినిమాపై పుకార్లు
X
త్వరలోనే గబ్బర్ సింగ్-2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు పవన్. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. దాసరి నారాయణరావుతో చేయబోతున్న సినిమానే ఇప్పుడు నెట్ లో బాగా పాపులర్ అయింది. ఈ సినిమాకి కల్కి అనే టైటిల్ పెట్టారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు ఊతమిస్తూ.. దాసరి కూడా తన బ్యానర్ పై కల్కి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు పవన్ గుబురుగా గెడ్డం పెంచడంతో.. కల్కి టైటిల్ కు, పవన్ గెడ్డంకి లింకు పెడుతూ కథనాలు వచ్చేస్తున్నాయి.

అయితే దాసరి మాత్రం ఈ అంశాల్ని ఖండిస్తున్నారు. పవన్ సినిమాకు ఇంకా టైటిల్ కాదుకదా.. కనీసం కథను కూడా అనుకోలేదని కన్ ఫర్మ్ చేశారు. అయితే మ్యూజిక్ డైరక్టర్ విషయంలో మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు దాసరి. పవన్ సినిమాకు అనూప్ రూబెన్స్, దేవిశ్రీప్రసాద్ కలిసి సంగీతం అందిస్తారనే ప్రచారంలో కాస్త నిజం ఉందంటున్నారు దర్శకరత్న. ఈ సినిమాపై అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి ఇంకొన్ని నెలల టైం పడుతుందని మాత్రం చెప్పుకొచ్చారు.

Next Story