Telugu Global
NEWS

బాబు పాల‌న‌పై కాంగ్రెస్ సీడీ విడుద‌ల‌

చంద్ర‌బాబు యేడాది పాల‌న‌పై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం సంధించింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం యేడాది కాలంలో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్క‌టీ స‌రిగా నెర‌వేర్చ‌లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్  కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు. అదిరింద‌య్యా చంద్రం  అని కాంగ్రెస్ పార్టీ త‌యారు చేసిన ఓ సిడీని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌ఘువీరాతోపాటు కే.వి.పి. రామ‌చంద్ర‌రావు, ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు వాగ్దానాల‌తో ప్ర‌జ‌ల్ని ఎలా మోసం చేసిందీ ఈ సీడీలో వివ‌రించారు. అధికారంలోకి వ‌చ్చాక […]

బాబు పాల‌న‌పై కాంగ్రెస్ సీడీ విడుద‌ల‌
X
చంద్ర‌బాబు యేడాది పాల‌న‌పై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం సంధించింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం యేడాది కాలంలో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్క‌టీ స‌రిగా నెర‌వేర్చ‌లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు. అదిరింద‌య్యా చంద్రం అని కాంగ్రెస్ పార్టీ త‌యారు చేసిన ఓ సిడీని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌ఘువీరాతోపాటు కే.వి.పి. రామ‌చంద్ర‌రావు, ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు వాగ్దానాల‌తో ప్ర‌జ‌ల్ని ఎలా మోసం చేసిందీ ఈ సీడీలో వివ‌రించారు. అధికారంలోకి వ‌చ్చాక ఎలా మోసం చేస్తున్న‌దీ వివ‌రించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ‌హానాడుకు ద‌గానాడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుంద‌ని వార‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామ‌ని, ఈ సీడీ ఆవిష్క‌ర‌ణ ఆరంభం మాత్ర‌మేన‌ని ర‌ఘువీరా చెప్పారు.
First Published:  27 May 2015 5:24 AM GMT
Next Story