Telugu Global
Cinema & Entertainment

సత్యమూర్తి అనుభవాలు పంచుకున్న స్నేహ

తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసింది స్నేహ. ఆ సినిమాను చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. ఎందుకుంటే.. ప్రస్తుతానికి స్నేహ కెరీర్ లో ఆఖరి సినిమా ఇదే. ఎందుకంటే ప్రస్తుతం ఆమె గర్భవతి. ఆగస్ట్ లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. కాబట్టి.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మళ్లీ ఆమె ఎప్పుడు వెండితెరపై కనిపిస్తుందనే విషయం అప్పుడే చెప్పలేం. అందుకే తన కెరీర్ లో సన్నాఫ్ సత్యమూర్తిని స్పెషల్ మూవీగా చెప్పుకొచ్చింది స్నేహ. ఈ సినిమా […]

సత్యమూర్తి అనుభవాలు పంచుకున్న స్నేహ
X
తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసింది స్నేహ. ఆ సినిమాను చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. ఎందుకుంటే.. ప్రస్తుతానికి స్నేహ కెరీర్ లో ఆఖరి సినిమా ఇదే. ఎందుకంటే ప్రస్తుతం ఆమె గర్భవతి. ఆగస్ట్ లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. కాబట్టి.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మళ్లీ ఆమె ఎప్పుడు వెండితెరపై కనిపిస్తుందనే విషయం అప్పుడే చెప్పలేం. అందుకే తన కెరీర్ లో సన్నాఫ్ సత్యమూర్తిని స్పెషల్ మూవీగా చెప్పుకొచ్చింది స్నేహ. ఈ సినిమా షూటింగ్ విశేషాల్ని, అనుభవాల్ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో రాసుకొచ్చింది.

హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ నుంచి హీరోయిన్లు నిత్యామీనన్, సమంత వరకు ఎవరెవరు తనకు ఎంత క్లోజ్ అనే విషయాల్ని రాసుకొచ్చింది. మరీ ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. షూటింగ్ టైమ్ లో రాజేంద్రప్రసాద్ తనను చాలా బాగా చూసుకున్నారంటోంది స్నేహ. నిజానికి సత్యమూర్తి సినిమాలో రాజేంద్రప్రసాద్, స్నేహ మధ్య పేస్ టు ఫేస్ సీన్లు లేకపోయినప్పటికీ.. ఇద్దరూ కలిసి కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తారు.

First Published:  25 May 2015 12:30 AM GMT
Next Story