Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 93

“పదిమంది ఒక గొడుగు కింద ఉన్నారు. వాళ్ళెందుకు తడవలేదు? “వర్షం పడ్డం లేదు కాబట్టి!” —————- “ప్రపంచంలో నాకు తెలిసిన దారుణమయిన వంటవాడు నువ్వే” “ఎందుకు సార్‌ అంత ఖచ్చితంగా చెప్పారు”. “ఫ్రూట్‌ సలాడ్‌ని ఎవరయినా వుడక బెడతారా?” ——————— “వెయిటర్‌! నా సూప్‌లో బల్లి ఉంది. మీ మేనేజర్‌ని పిలువు” “అయ్యో మా మేనేజర్‌కు బల్లంటే చచ్చేంత భయం. రాడండి!” ————————– “డాక్టర్‌! నాకు నిద్రపట్టడం లేదు, ఏదన్నా సాయం చెయ్యండి!” “ఫోన్‌ దగ్గరే చెవి […]

“పదిమంది ఒక గొడుగు కింద ఉన్నారు. వాళ్ళెందుకు తడవలేదు?
“వర్షం పడ్డం లేదు కాబట్టి!”
—————-
“ప్రపంచంలో నాకు తెలిసిన దారుణమయిన వంటవాడు నువ్వే”
“ఎందుకు సార్‌ అంత ఖచ్చితంగా చెప్పారు”.
“ఫ్రూట్‌ సలాడ్‌ని ఎవరయినా వుడక బెడతారా?”
———————
“వెయిటర్‌! నా సూప్‌లో బల్లి ఉంది. మీ మేనేజర్‌ని పిలువు”
“అయ్యో మా మేనేజర్‌కు బల్లంటే చచ్చేంత భయం. రాడండి!”
————————–
“డాక్టర్‌! నాకు నిద్రపట్టడం లేదు, ఏదన్నా సాయం చెయ్యండి!”
“ఫోన్‌ దగ్గరే చెవి పెట్టుకుని పడుకోండి జోలపాట పాడుతాను”

First Published:  24 May 2015 1:03 PM GMT
Next Story