Telugu Global
Cinema & Entertainment

  చెర్రీ ఎక్స్ ట్రా కేర్ 

 ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ లో ఉంది. యూరోప్ లోని కొన్ని అందమైన లొకేషన్లలో సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు సంబంధించి మరింత కేర్ తీసుకుంటున్నాడట చరణ్. మరీ ముఖ్యంగా బడ్జెట్ పరిమితులు దాటిపోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాడు. దీనికి కారణం శ్రీనువైట్లే అని తెలుస్తోంది. ఆగడు సినిమా […]

  చెర్రీ ఎక్స్ ట్రా కేర్ 
X
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ లో ఉంది. యూరోప్ లోని కొన్ని అందమైన లొకేషన్లలో సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు సంబంధించి మరింత కేర్ తీసుకుంటున్నాడట చరణ్. మరీ ముఖ్యంగా బడ్జెట్ పరిమితులు దాటిపోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాడు. దీనికి కారణం శ్రీనువైట్లే అని తెలుస్తోంది. ఆగడు సినిమా కోసం విపరీతంగా ఖర్చుపెట్టించాడట శ్రీనువైట్ల.

ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ తర్వాతే మహేష్ కూడా బడ్జెట్ విషయంలో కేర్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అలాంటి శ్రీనువైట్ల తో సినిమా చేస్తున్నాడు కాబట్టే చరణ్ కూడా బడ్జెట్ విషయంలో కండిషన్స్ పెట్టాడట. సినిమాని వీలైనంత తక్కువ బడ్జెట్ లో 70-80 రోజుల్లోనే పూర్తిచేయాలని డైరక్టర్ కు ఆదేశాలిచ్చాడు. మరి ఈసారైనా శ్రీనువైట్ల బడ్జెట్ ను కంట్రోల్ లో పెడతాడా.. లేక ఇబ్బడిముబ్బడిగా ఖర్చుపెట్టిస్తాడా అనేది చూడాలి.

First Published:  23 May 2015 12:31 AM GMT
Next Story