Telugu Global
Others

3 నెల‌ల్లో గ్రామాల‌కు 100% గ్యాస్ క‌నెక్ష‌న్‌లు

వచ్చే మూడు నెలల్లో గ్రామాల్లో నూరు శాతం గ్యాస్‌ కనెక్షన్‌లు ఇవ్వాల‌ని, ఇందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.. కలెక్టర్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. రైతులే తనకు ముఖ్యమని ఆయ‌న అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, రుణమాఫీ ప్రక్రియను సమర్దవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డులపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. స్వచ్ఛ ఏపీ […]

వచ్చే మూడు నెలల్లో గ్రామాల్లో నూరు శాతం గ్యాస్‌ కనెక్షన్‌లు ఇవ్వాల‌ని, ఇందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.. కలెక్టర్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. రైతులే తనకు ముఖ్యమని ఆయ‌న అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, రుణమాఫీ ప్రక్రియను సమర్దవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డులపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. స్వచ్ఛ ఏపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే సంక్షేమ పథకాలు, రుణవిముక్తి లబ్ధిదారులు, పెన్షన్‌ లబ్ధిదారులతో గ్రామ కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బదిలీల పేరుతో ఉద్యోగులను వేధించొద్దన్నారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. వడదెబ్బకు జనం చనిపోకుండా చర్యలు తీసుకోవాలని, అవ‌స‌ర‌మైతే గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

First Published:  22 May 2015 1:10 PM GMT
Next Story