Telugu Global
Others

ముంబ‌యి ఫిల్మ్‌సిటీలో కాల్పులు

ముంబ‌యి ఫిల్మ్‌సిటీలో కాల్పులు తెగ‌బ‌డ్డారు ముగ్గురు దుండ‌గులు. మూడు రౌండ్లు జ‌రిపిన కాల్పుల్లో ఒక‌రు గాయ‌ప‌డ్డారు. అనుకోని ఈ సంఘ‌ట‌న‌కు ఆ చుట్టుప‌క్క‌లున్న వారు భీతావాహులై పోయారు. కాల్పులు జ‌రిగిన సంఘ‌ట‌న ప‌క్క‌నే సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ షూటింగ్ జ‌రుగుతోంది. ఆ యూనిట్‌లో ఉన్న‌వారు ఒక్క‌సారిగా అదిరిపోయారు. త‌మ షూటింగ్ స్పాట్‌కు కేవ‌లం 20 అడుగుల దూరంలోనే కాల్పులు జ‌రిగిన‌ట్టు అమితాబ్ త‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. స్టుడియో నెంబ‌ర్ 2 వ‌ద్ద జ‌రిగిన ఈ కాల్పులు […]

ముంబ‌యి ఫిల్మ్‌సిటీలో కాల్పులు తెగ‌బ‌డ్డారు ముగ్గురు దుండ‌గులు. మూడు రౌండ్లు జ‌రిపిన కాల్పుల్లో ఒక‌రు గాయ‌ప‌డ్డారు. అనుకోని ఈ సంఘ‌ట‌న‌కు ఆ చుట్టుప‌క్క‌లున్న వారు భీతావాహులై పోయారు. కాల్పులు జ‌రిగిన సంఘ‌ట‌న ప‌క్క‌నే సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ షూటింగ్ జ‌రుగుతోంది. ఆ యూనిట్‌లో ఉన్న‌వారు ఒక్క‌సారిగా అదిరిపోయారు. త‌మ షూటింగ్ స్పాట్‌కు కేవ‌లం 20 అడుగుల దూరంలోనే కాల్పులు జ‌రిగిన‌ట్టు అమితాబ్ త‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. స్టుడియో నెంబ‌ర్ 2 వ‌ద్ద జ‌రిగిన ఈ కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు. సంఘ‌ట‌న స్థ‌లికి పోలీసులు చేరుకుని విచార‌ణ మొద‌లుపెట్టారు.
First Published:  21 May 2015 1:22 PM GMT
Next Story