Telugu Global
Others

ఆమనగల్ కళాకారుడికి అంతర్జాతీయ ఖ్యాతి

ఇండియన్‌ ఆర్ట్స్‌ కలెక్టర్‌ సంస్థ ఆన్‌లైన్‌లో చిత్రకళా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పం రాఘవకు తొలిసారిగా అంత‌ర్జాతీయ ఖ్యాతి ద‌క్కింది. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు ఇండియన్‌ ఆర్ట్స్‌ కళా సంస్థలో తాము గీసిస చిత్రాలు ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకుంటారు. కళాకారుడి నైపుణ్యం, సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు, చిత్రం ఇచ్చే సందేశాన్ని బట్టి ఈ సంస్థ చిత్రాల ప్రదర్శనకు కళాకారులను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో రెండు నెలల కిందట రాఘవ ఆ […]

ఇండియన్‌ ఆర్ట్స్‌ కలెక్టర్‌ సంస్థ ఆన్‌లైన్‌లో చిత్రకళా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పం రాఘవకు తొలిసారిగా అంత‌ర్జాతీయ ఖ్యాతి ద‌క్కింది. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు ఇండియన్‌ ఆర్ట్స్‌ కళా సంస్థలో తాము గీసిస చిత్రాలు ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకుంటారు. కళాకారుడి నైపుణ్యం, సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు, చిత్రం ఇచ్చే సందేశాన్ని బట్టి ఈ సంస్థ చిత్రాల ప్రదర్శనకు కళాకారులను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో రెండు నెలల కిందట రాఘవ ఆ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రకృతి తల్లి వంటిదన్న రాఘవ సందేశాత్మక చిత్రాలకు సంస్థ స్పందించింది. ఈ నెల 17న రాఘవకు సంస్థ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహించి, ప్రదరనకు ఎంపిక చేశారు. ఈ ప్రదర్శనలో రాఘవ తెలంగాణ సంస్కృతి, సమాజంలో చోటు చేసుకుంటుకున్న సంఘటనలకు అద్దం పట్టే చిత్రాలను ఉంచారు. బ్రైట్‌ కలర్స్‌, లైన్‌ డ్రాయింగ్‌తో కూడిన ఈ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 16 చిత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు రాఘవ పేర్కొన్నారు. ప్రధానంగా బతుకమ్మ, ప్రకృతితో పాటు భార్యాభర్తల బంధం, శ్రీరాముడు, హన్మంతుడు, నీటి సంరక్షణ, సమాజం పోకడలు తదితర అంశాలతో కూడిన చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి.
First Published:  21 May 2015 1:05 PM GMT
Next Story