Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 88

“బాబూ! ఈరోజు పాలు మరీ నీళ్ళుగా ఉన్నాయెందుకు?” పాలతను: “నిన్న మా గేదె వర్షంలో బాగా తడిచింది” ———————————— “వెయిటర్‌! ఈ కోడిగ్రుడ్డు ఫ్రెష్‌గా ఉందా?” “ఔన్సార్‌! అసలు ఈ గుడ్డుపెట్టిన సంగతి కోడిపెట్టకు కూడా తెలీకుండా అరగంట క్రితమే తీసుకొచ్చాం సార్‌!” ———————————— ఇంటి ఓనరు: నా ఇంటి అద్దె వెయ్యిరూపాయలు ఎప్పుడిస్తావు? అద్దెకున్నతను: రెండు వేలు అప్పిచ్చి చూడండి. మీ ఇంటి అద్దె వెయ్యి రూపాయలు మీ మొఖాన కొట్టకుంటే అప్పుడు చెప్పండి! ———————————— […]

“బాబూ! ఈరోజు పాలు మరీ నీళ్ళుగా ఉన్నాయెందుకు?”
పాలతను: “నిన్న మా గేదె వర్షంలో బాగా తడిచింది”
————————————
“వెయిటర్‌! ఈ కోడిగ్రుడ్డు ఫ్రెష్‌గా ఉందా?”
“ఔన్సార్‌! అసలు ఈ గుడ్డుపెట్టిన సంగతి కోడిపెట్టకు కూడా తెలీకుండా అరగంట క్రితమే తీసుకొచ్చాం సార్‌!”

————————————
ఇంటి ఓనరు: నా ఇంటి అద్దె వెయ్యిరూపాయలు ఎప్పుడిస్తావు?
అద్దెకున్నతను: రెండు వేలు అప్పిచ్చి చూడండి. మీ ఇంటి అద్దె వెయ్యి రూపాయలు మీ మొఖాన కొట్టకుంటే అప్పుడు చెప్పండి!

————————————
మనోజ్‌: రాజూ! ఎందుకు కుంటుతున్నావ్‌?
రాజు: నిన్న డాక్టర్‌ దగ్గరికి వెళితే అన్నీ చెకప్‌ చేసి ఆరోగ్యంగా ఉన్నానని, నాకు ఎట్లాంటి సమస్యా లేదని అభినందనగా నా వీపుపై చరిచాడు. నేను ముందుకు తూలి కింద పడ్డాను. కాలువిరిగింది!

————————————
“మీ కుక్క నన్ను చూసిన సంతోషంతో నా పక్కనే కూర్చుని తోక కదిలిస్తోంది.
గొప్ప కుక్కని సంపాదించావోయ్‌!” అన్నాడు ప్రసాద్‌ మిత్రుడు శేఖర్‌తో.
శేఖర్‌ కొడుకు కల్పించుకొని “అది కాదండి. దాని ప్లేట్లో మీరు టిఫిన్‌ తింటున్నారు. అందుకని తోక కదిలిస్తోంది”.

First Published:  19 May 2015 1:03 PM GMT
Next Story