Telugu Global
Others

తేనెటీగ‌ల దాడిలో ఒక‌రు మృతి

శివుడి ద‌ర్శ‌నం కోసం వారు వెళ్ళారు. రాత్రిపూట నిద్ర చేసి తెల్లారి శివ నామ స్మ‌ర‌ణ‌తో భ‌గ‌వంతుడ్ని చూద్దామ‌నుకున్నారు. ఇంత‌లో తేనెటీగ‌లు దాడి చేశాయి. ఈ సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లా చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లం పెద‌గాడి గ్రామంలో జ‌రిగింది. బుగ్గవంక శివాల‌యం ప్రాంగ‌ణంలో ఆదమ‌రిచి నిద్ర పోతున్న ఈ భ‌క్తుల‌పై తేనెటీగ‌లు ఉన్న‌ట్టుండి దాడి చేశాయి. ఈ దాడిలో నిద్ర పోతున్న 20 మంది గాయ‌ప‌డ్డారు. ఇందులో ఒక‌రు మ‌ర‌ణించ‌గా మ‌రో ముగ్గురి ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉంది. 

First Published:  18 May 2015 1:15 PM GMT
Next Story