Telugu Global
Others

కేంద్ర-రాష్ట్ర సంబంధాల‌కు బీజేపీ సెగ: సీపీఎం

సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తోందని… సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. రెండురోజులపాటు సాగిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగింపు సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయాల్సింది పోయి మరింత బలహీన పరుస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని తుంగలోకి తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా-చైనా సంబంధాలు మెరుగవ్వాలని […]

సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తోందని… సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. రెండురోజులపాటు సాగిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగింపు సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయాల్సింది పోయి మరింత బలహీన పరుస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయటమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని తుంగలోకి తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా-చైనా సంబంధాలు మెరుగవ్వాలని సీపీఎం కోరుకుంటుందని ఏచూరి తెలిపారు. మోడీ చైనా పర్యటన సైతం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేలా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా అవసరాలకు విరుద్ధంగా… కార్పొరేట్లకు అనుకూలంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రభుత్వ వ్యవహారాల్లనూ చొరబడిందన్న ఏచూరీ ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
First Published:  17 May 2015 1:53 PM GMT
Next Story