తొలిసారి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పవన్
కథ, స్క్రీన్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు పవన్ కల్యాణ్. అవసరమైతే కథ-కథనంలో తనే దగ్గరుండి కొన్ని మార్పులు కూడా చేస్తాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న గబ్బర్ సింగ్-2 సిినిమాకైతే ఈ రెండు విభాగాల్ని తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు మరో విభాగంలోకి కూడా ఎంటరయ్యాడు పవర్ స్టార్. మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా కూర్చుంటున్నాడు. జనరల్ గా ఓ 3 ట్యూన్స్ పక్కా అయిన తర్వాత వాటిలోంచి ఒకటి లేదా రెండు బాణీల్ని […]
BY admin17 May 2015 12:53 AM GMT
X
admin Updated On: 17 May 2015 12:53 AM GMT
కథ, స్క్రీన్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు పవన్ కల్యాణ్. అవసరమైతే కథ-కథనంలో తనే దగ్గరుండి కొన్ని మార్పులు కూడా చేస్తాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న గబ్బర్ సింగ్-2 సిినిమాకైతే ఈ రెండు విభాగాల్ని తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు మరో విభాగంలోకి కూడా ఎంటరయ్యాడు పవర్ స్టార్. మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా కూర్చుంటున్నాడు.
జనరల్ గా ఓ 3 ట్యూన్స్ పక్కా అయిన తర్వాత వాటిలోంచి ఒకటి లేదా రెండు బాణీల్ని హీరో కన్ ఫర్మ్ చేస్తాడు. దర్శకుడి సూచనలు-సలహాలు కూడా లెక్కలోకి తీసుకుంటాడు. ఇన్నాళ్లూ పవన్ అలానే చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ గబ్బర్ సింగ్-2 సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ లో తను కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం చెన్నైలో గబ్బర్ సింగ్-2 సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, దర్శకుడు బాబీతో పాటు పవన్ కూడా ఇందులో పాల్గొన్నాడు. ఇప్పటికే రెండు ట్యూన్స్ ఓకే చేసినట్టు సమాచారం.
Next Story