27 ఏళ్లు పూర్తి చేసుకున్న చార్మీ!
2002లో నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది చార్మీ. అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. 13 ఏళ్లుగా టాలీవుడ్‌లో నెగ్గుకు రావడం అంటే మామూలు విషయం కాదు. మే 17 అంటే నేటితో ఈ పంజాబి ముద్దుగమ్మకి 27 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సారి చార్మి బర్త్‌డేకు ఓ ప్రత్యేకత ఉంది. తన కెరీర్‌ను నిర్ణయించే రెండు కీలకమైన సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ‘మంత్ర-2’ , పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘జ్యోతి లక్ష్మీ’ […]
BY admin17 May 2015 12:18 AM GMT
X
admin Updated On: 17 May 2015 12:19 AM GMT
2002లో నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది చార్మీ. అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. 13 ఏళ్లుగా టాలీవుడ్‌లో నెగ్గుకు రావడం అంటే మామూలు విషయం కాదు. మే 17 అంటే నేటితో ఈ పంజాబి ముద్దుగమ్మకి 27 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సారి చార్మి బర్త్‌డేకు ఓ ప్రత్యేకత ఉంది. తన కెరీర్‌ను నిర్ణయించే రెండు కీలకమైన సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ‘మంత్ర-2’ , పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘జ్యోతి లక్ష్మీ’ సినిమాలపై చార్మీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలు ఆడితే మరో రెండు మూడేళ్లు బండిని లాగించేయవచ్చన్న ఆలోచనలో ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చార్మీ నటించడం ఇది రెండోసారి. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా 2011లో వచ్చిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాలో చార్మీ లీడ్ రోల్ చేసింది. ఆ సినిమా హిట్ అయినా అమ్మడికి ఆఫర్లు రాలేదు. అయితే అది బాలీవుడ్, ఇక్కడ అలాకాదు. ఒక్క సినిమా హిట్ అయితే, రెండేళ్ల వరకు బిజీ కావచ్చు. చూద్దాం చార్మీ అదృష్టం ఎలా ఉందో!
Next Story