Telugu Global
Others

వ్య‌ర్థాల నుంచి విద్యుత్తు: చంద్ర‌బాబు

రాష్ట్రంలో ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్థాల పున‌ర్వినియోగంపై ఏపీ సీఎం దృష్టి సారించారు. ఈ మేర‌కు అధికారుల‌తో త‌న నివాసంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో రోజుకు 9 వేల ట‌న్నుల వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతున్నాయ‌న్నారు. వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. జిల్లాకో విద్యుత్తు ప్లాంటు చొప్పున 18 నెల‌ల్లో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాల్లో ప‌శు, వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల పున‌ర్వియోగంపైనా దృష్టి సారించాల‌ని సూచించారు. బెంగ‌ళూరు, ఢిల్లీలో ఘ‌న వ్య‌ర్థాలు కొండ‌ల్లా పేరుకుపోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం […]

వ్య‌ర్థాల నుంచి విద్యుత్తు: చంద్ర‌బాబు
X
రాష్ట్రంలో ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్థాల పున‌ర్వినియోగంపై ఏపీ సీఎం దృష్టి సారించారు. ఈ మేర‌కు అధికారుల‌తో త‌న నివాసంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో రోజుకు 9 వేల ట‌న్నుల వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతున్నాయ‌న్నారు. వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. జిల్లాకో విద్యుత్తు ప్లాంటు చొప్పున 18 నెల‌ల్లో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాల్లో ప‌శు, వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల పున‌ర్వియోగంపైనా దృష్టి సారించాల‌ని సూచించారు. బెంగ‌ళూరు, ఢిల్లీలో ఘ‌న వ్య‌ర్థాలు కొండ‌ల్లా పేరుకుపోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలో రాకుండా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఘ‌న వ్య‌ర్థాల‌ను ఇంధ‌నంగా మార్చుకుంటే ఈ స‌మ‌స్య ఉత్ప‌న్నం కాద‌ని అన్నారు. ఇది ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో మేలు చేస్తుంద‌ని తెలిపారు.
First Published:  16 May 2015 11:42 PM GMT
Next Story