Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 84

హోటల్‌ మేనేజర్‌: మీరు ఒకరోజు మా హోటల్‌ గదిలో వుండి ఆనందించారు కదా! వదిలి వెళుతూ వుంటే ఎలా ఫీలవుతున్నారు. గెస్ట్‌: పైగా డబ్బిచ్చి వున్న చోటు కదా! వదిలిపెట్టడానికి మనసొప్పడం లేదయ్యా. ———————————————————- సతీష్‌: మా చిన్నవాణ్ణి సమ్మర్‌ క్యాంప్‌కి పంపుతున్నాం. స్నేహితుడు: సెలవుల్లో హాయిగా గడుపుతాడు. సతీష్‌: వాడు కాదు మేం! ———————————————————- వాళ్ళు సెలవుల్లో ఒక ఫాంహౌస్‌లో గది తీసుకుని వారంరోజులు గడిపారు. పిల్లలు కూడా హాపీగా గడిపారు. వచ్చారు. మళ్ళీ రాబోయే […]

హోటల్‌ మేనేజర్‌: మీరు ఒకరోజు మా హోటల్‌ గదిలో వుండి ఆనందించారు కదా!
వదిలి వెళుతూ వుంటే ఎలా ఫీలవుతున్నారు.
గెస్ట్‌: పైగా డబ్బిచ్చి వున్న చోటు కదా! వదిలిపెట్టడానికి మనసొప్పడం లేదయ్యా.
———————————————————-
సతీష్‌: మా చిన్నవాణ్ణి సమ్మర్‌ క్యాంప్‌కి పంపుతున్నాం.
స్నేహితుడు: సెలవుల్లో హాయిగా గడుపుతాడు.
సతీష్‌: వాడు కాదు మేం!
———————————————————-
వాళ్ళు సెలవుల్లో ఒక ఫాంహౌస్‌లో గది తీసుకుని వారంరోజులు గడిపారు. పిల్లలు కూడా హాపీగా గడిపారు. వచ్చారు. మళ్ళీ రాబోయే సెలవుల్లో అక్కడికే వెళదామని అందరూ అన్నారు. రాజీవ్‌ పిల్లలు చెప్పినట్లే చేద్దామని ఆ ఫాంహౌస్‌ వాళ్ళకు ఉత్తరం రాస్తూ, “ఆ వారం రోజులూ ఆ ఫాంహౌస్‌లో ఆనందంగా గడిపాం. అక్కడ మాకు నచ్చనిదల్లా అక్కడ పందులు చేసే శబ్దం” అని రాశాడు.
ఫాంహౌస్‌ నించి బదులు వచ్చింది.
“మీ ఉత్తరానికి సంతోషం. మీరు వస్తున్నందుకు ఆనందం. పందుల గురించి రాశారు. మీరు వెళ్ళిపోయాక అవీ వెళ్ళిపోయాయి?
———————————————————-
డాక్టర్‌: మీ ఆవిడ టెన్నిస్‌ బ్యాట్‌తో కొట్టిందా? ఎందుకని?
పేషెంట్‌: సమయానికి క్రికెట్‌ బ్యాట్‌ దొరకలేదని!
———————————————————-
జానీ: డాక్టర్‌! ఈ బాటిల్‌ మందుతో నా జలుబు తగ్గుతుందంటారా?
డాక్టర్‌: నీకా సందేహమే అక్కర్లేదు. బాటిల్‌ పట్టుకుపోయిన వాళ్ళెవరూ ఇప్పటిదాకా తిరిగి రాలేదు.

First Published:  15 May 2015 1:00 PM GMT
Next Story