అల్లంతో ఎనలేని ప్రయోజనాలు
అల్లం అనగానే నాన్‌వెజ్ మసాలాలో ఉపయోగించే విషయమే మనకు గుర్తుకు వస్తుంది. అయితే అల్లంతోనూ అనేక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అవేమిటో చూద్దాం. – అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ టీ త్రాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. రుతుక్రమ సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను కొంతవరకు తగ్గిస్తుంది. వేవిళ్ల బాధతో సతమతమయ్యే గర్భవతుల సమస్య తగ్గుతుంది. – అల్లం ముక్కని క్యారెట్, టమాటోలతో […]
BY sarvi14 May 2015 8:10 PM GMT
X
sarvi Updated On: 14 May 2015 3:34 AM GMT
అల్లం అనగానే నాన్‌వెజ్ మసాలాలో ఉపయోగించే విషయమే మనకు గుర్తుకు వస్తుంది. అయితే అల్లంతోనూ అనేక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అవేమిటో చూద్దాం.
– అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ టీ త్రాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. రుతుక్రమ సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను కొంతవరకు తగ్గిస్తుంది. వేవిళ్ల బాధతో సతమతమయ్యే గర్భవతుల సమస్య తగ్గుతుంది.
– అల్లం ముక్కని క్యారెట్, టమాటోలతో కలపి జ్యూస్ చేసి తేనెలో కలపాలి. ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తం శుద్ధి అవుతుంది.
– అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
Next Story