Telugu Global
Others

స్మార్ట్ సిటీల వ‌ల్ల ఐటీకి బూమ్: నాస్కామ్

ప్రభుత్వం ప్రతిపాదించిన వంద స్మార్ట్‌ సిటీల అభివృద్ధి పథకం మూలంగా రానున్న కాలంలో దేశీయ ఐటి రంగానికి అద్భుతమైన వ్యాపార అవకాశాలు లభించనున్నట్టు ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్‌ పేర్కొంది. వచ్చే ఐదు నుంచి పదేళ్ల కాలంలోనే స్మార్ట్‌ సిటీలతో కనీసం 3,000-4,000 కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలు లభించనున్నట్టు తెలిపింది. ప్రజలకు మెరుగైన సదుపాయాలను అందించేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకంగా మార్చేందుకు ప్రభుత్వం స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. వీటి […]

ప్రభుత్వం ప్రతిపాదించిన వంద స్మార్ట్‌ సిటీల అభివృద్ధి పథకం మూలంగా రానున్న కాలంలో దేశీయ ఐటి రంగానికి అద్భుతమైన వ్యాపార అవకాశాలు లభించనున్నట్టు ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్‌ పేర్కొంది. వచ్చే ఐదు నుంచి పదేళ్ల కాలంలోనే స్మార్ట్‌ సిటీలతో కనీసం 3,000-4,000 కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలు లభించనున్నట్టు తెలిపింది. ప్రజలకు మెరుగైన సదుపాయాలను అందించేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకంగా మార్చేందుకు ప్రభుత్వం స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. వీటి అభివృద్ధి కోసం ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు కేటాయించింది. స్మార్ట్‌ సిటీగా ఎంపికయ్యే నగరం ఐదేళ్లపాటు ఏడాదికి 100 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం నుంచి పొందనుంది. ఈ ప్రాజెక్టు మూలంగా ఐటి కంపెనీలకు కొత్త అవకాశాలు లభించినట్టేనని, మొత్తం స్మార్ట్‌ సిటీల వ్యయంలో 10-15 శాతం ఐసిటికి లభిస్తుందని ఆశిస్తున్నట్టు నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.
First Published:  13 May 2015 7:20 PM GMT
Next Story