Telugu Global
Health & Life Style

ముఖంపై మ‌చ్చ‌లు పోవాలంటే...

చాలామందికి ముఖంపై న‌ల్ల‌ని చారిక‌ల లాంటి మ‌చ్చ‌లు ఇబ్బంది పెడుతుంటాయి. మ‌హిళ‌ల‌లో ఇది మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ మ‌చ్చ‌ల నివార‌ణ‌కు వారు ర‌క‌ర‌కాలుగా ప్ర‌యాస ప‌డుతుంటారు. ముఖంపై మ‌చ్చ‌ల నివార‌ణ‌కు కొన్ని చిట్కాలు… – ఈ స‌మ‌స్య ఉన్న‌వారు ఎక్కువ‌గా నీరు తాగుతుండాలి. దాని వ‌ల్ల ముఖం తాజాగా త‌యార‌వుతుంది.  – కొంచెం ఉల్లి ర‌సంలో ఒక స్పూను తేనెను క‌లిపి రాసుకుంటే ముఖంపై మ‌చ్చ‌ల‌ను నివారించ‌వ‌చ్చు. – నిమ్మ‌తొక్క‌తో మ‌చ్చ‌ల‌పై మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల […]

ముఖంపై మ‌చ్చ‌లు పోవాలంటే...
X
చాలామందికి ముఖంపై న‌ల్ల‌ని చారిక‌ల లాంటి మ‌చ్చ‌లు ఇబ్బంది పెడుతుంటాయి. మ‌హిళ‌ల‌లో ఇది మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ మ‌చ్చ‌ల నివార‌ణ‌కు వారు ర‌క‌ర‌కాలుగా ప్ర‌యాస ప‌డుతుంటారు. ముఖంపై మ‌చ్చ‌ల నివార‌ణ‌కు కొన్ని చిట్కాలు…
– ఈ స‌మ‌స్య ఉన్న‌వారు ఎక్కువ‌గా నీరు తాగుతుండాలి. దాని వ‌ల్ల ముఖం తాజాగా త‌యార‌వుతుంది.
– కొంచెం ఉల్లి ర‌సంలో ఒక స్పూను తేనెను క‌లిపి రాసుకుంటే ముఖంపై మ‌చ్చ‌ల‌ను నివారించ‌వ‌చ్చు.
– నిమ్మ‌తొక్క‌తో మ‌చ్చ‌ల‌పై మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల చాలా ఫ‌లితం క‌నిపిస్తుంది.
– బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి నానిన త‌ర్వాత దంచి ఒక స్పూను నిమ్మ‌ర‌సంలో క‌లిపి మెత్త‌గా పేస్ట్‌లా చేసుకుని ముఖానికి ప‌ట్టిస్తే గుణం క‌నిపిస్తుంది. వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లిత‌ముంటుంది.
– కొంచెం ఉల్లిర‌సంలో దూదిని ముంచి న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న చోట రాసుకుంటే మ‌చ్చ‌లు తొల‌గుతాయి.
– అర‌క‌ప్పు ట‌మాటా ర‌సంలో అర‌క‌ప్పు మ‌జ్జిగ‌ను క‌లిపి మ‌చ్చ‌ల మీద రాసుకుంటే వాటిని నివారించ‌వ‌చ్చు.
– పై చిట్కాలు పాటిస్తూ ముఖాన్ని త‌ర‌చుగా స‌బ్బుతో క‌డుగుతూ ఉంటే మ‌చ్చ‌లు తేలిక‌గా తొల‌గిపోతాయి.
First Published:  13 May 2015 10:51 PM GMT
Next Story