Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 82

కస్టమర్‌: వెయిటర్‌! ఇక్కడ ఎన్నాళ్ళనించీ పనిచేస్తున్నావ్‌. వెయిటర్‌: రెండు నెలలయిదండీ చేరి. కస్టమర్‌: ఓహో! ఐతే నా ఆర్డర్‌ తీసుకున్నది నువ్వు కాదనుకుంటాను. —————————– ఆమె: మా అబ్బాయిని డజన్‌ అరటిపళ్ళు తెమ్మని డబ్బిచ్చాను. అరడజనే తెచ్చాడు. పళ్ళషాపతను: నేను డజనే ఇచ్చానమ్మా! మీ అబ్బాయి తూకం చూడండి తేడా తెలుస్తుంది. —————————– హాస్టల్‌లో వున్న కొడుకు తండ్రికి డబ్బుకోసం టెలిగ్రాం ఇచ్చాడు. నో మన్‌, నో ఫన్‌, యువర్‌ సన్‌! తండ్రి నించి వెంటనే మరో […]

కస్టమర్‌: వెయిటర్‌! ఇక్కడ ఎన్నాళ్ళనించీ పనిచేస్తున్నావ్‌.
వెయిటర్‌: రెండు నెలలయిదండీ చేరి.
కస్టమర్‌: ఓహో! ఐతే నా ఆర్డర్‌ తీసుకున్నది నువ్వు కాదనుకుంటాను.
—————————–
ఆమె: మా అబ్బాయిని డజన్‌ అరటిపళ్ళు తెమ్మని డబ్బిచ్చాను. అరడజనే తెచ్చాడు.
పళ్ళషాపతను: నేను డజనే ఇచ్చానమ్మా! మీ అబ్బాయి తూకం చూడండి తేడా తెలుస్తుంది.
—————————–
హాస్టల్‌లో వున్న కొడుకు తండ్రికి డబ్బుకోసం టెలిగ్రాం ఇచ్చాడు.
నో మన్‌, నో ఫన్‌, యువర్‌ సన్‌!

తండ్రి నించి వెంటనే మరో టెలిగ్రాం వచ్చింది.
హౌ శాడ్‌, టూ బాడ్‌, యువర్‌ డాడ్‌!
—————————–
బాలు: అబ్బా! నేను రెండువేల సంవత్సరాల వెనక పుట్టివుంటే బావుండేది.

వేలు: ఎందుకని?
బాలు: అప్పుడు ఇంత హిస్టరీ చదువుకునే బాధ వుండేది కాదు.

First Published:  13 May 2015 1:02 PM GMT
Next Story