Telugu Global
Others

త్వరలో హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 4జి

భారతి ఎయిర్‌టెల్‌ త్వరలోనే హైదరాబాద్‌లో తన 4జి సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది. గురువారం నుంచి చెన్నైలో ఆ తర్వాత ఈ నెలాఖరున ముంబై, హైదరాబాద్‌లో 4జి సర్వీసుల ట్రయల్స్‌ను సంస్థ నిర్వహించనుంది. హైదరాబాద్‌లో ఎఫ్‌డిడి ఎల్‌టిఇ (4జి)ని ప్రారంభించేందుకు కంపెనీ నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళ‌, బెంగళూరు, పూణె, చండీగఢ్‌, మొహాలీ సహా 16 నగరాల్లో ఎయిర్‌టెల్‌ తన 4జి సర్వీసులను అందిస్తోంది. తెలంగాణ అంత‌టా 3జి సేవ‌ల‌ను అందించ‌డానికి, అలాగే […]

భారతి ఎయిర్‌టెల్‌ త్వరలోనే హైదరాబాద్‌లో తన 4జి సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది. గురువారం నుంచి చెన్నైలో ఆ తర్వాత ఈ నెలాఖరున ముంబై, హైదరాబాద్‌లో 4జి సర్వీసుల ట్రయల్స్‌ను సంస్థ నిర్వహించనుంది. హైదరాబాద్‌లో ఎఫ్‌డిడి ఎల్‌టిఇ (4జి)ని ప్రారంభించేందుకు కంపెనీ నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళ‌, బెంగళూరు, పూణె, చండీగఢ్‌, మొహాలీ సహా 16 నగరాల్లో ఎయిర్‌టెల్‌ తన 4జి సర్వీసులను అందిస్తోంది. తెలంగాణ అంత‌టా 3జి సేవ‌ల‌ను అందించ‌డానికి, అలాగే హైద‌రాబాద్‌లో వైఫై సేవ‌ల‌కు ఈ 4 జి సేవ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.
First Published:  13 May 2015 1:35 PM GMT
Next Story