Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 80

జూలీ: అమ్మా! నేను స్కూలుకు వెళ్ళనే వెళ్ళను. తల్లి: ఎందుకు? ఏమైంది? జూలీ: సోమవారమేమో టీచర్‌ ఐదు ప్లస్‌ ఐదు పది అంది. మంగళవారం ఆరు ప్లస్‌ నాలుగు పది అంది. ఈరోజు ఏడు ప్లస్‌ మూడు పది అంది. టీచర్‌కే సరిగా తెలీకుంటే నేను స్కూలుకు ఎందుకెళ్ళాలి మమ్మీ. ———————– రోజీ: డాక్టర్లు, నర్సులు ఆపరేషనప్పుడు మాస్కులు ఎందుకు కట్టుకుంటారు? రాజీ: ఎవరు తప్పుచేసినా ఎవరు చేశారో తెలుసుకోకుండా ఉండేందుకు? ———————– భర్త: (ఫోన్లో భార్యకు) […]

జూలీ: అమ్మా! నేను స్కూలుకు వెళ్ళనే వెళ్ళను.
తల్లి: ఎందుకు? ఏమైంది?
జూలీ: సోమవారమేమో టీచర్‌ ఐదు ప్లస్‌ ఐదు పది అంది. మంగళవారం ఆరు ప్లస్‌ నాలుగు పది అంది. ఈరోజు ఏడు ప్లస్‌ మూడు పది అంది. టీచర్‌కే సరిగా తెలీకుంటే నేను స్కూలుకు ఎందుకెళ్ళాలి మమ్మీ.

———————–

రోజీ: డాక్టర్లు, నర్సులు ఆపరేషనప్పుడు మాస్కులు ఎందుకు కట్టుకుంటారు?
రాజీ: ఎవరు తప్పుచేసినా ఎవరు చేశారో తెలుసుకోకుండా ఉండేందుకు?

———————–

భర్త: (ఫోన్లో భార్యకు) రెండు సినిమా టికెట్లు కొన్నాను.
భార్య: (సంతోషంతో) సరే! నేను రెడీ అవుతాను.

భర్త: త్వరగా కా! మనం రేపు రాత్రికి సినిమాకెళ్ళాలి.

———————–

భారత క్రికెట్‌ జట్టు వరల్ట్‌కప్‌ పోటీల్లో ఓడిపోయి దిగాలుగా తిరిగివచ్చింది. మేనేజర్‌ వాళ్ళని ఉత్సాహ పరచడానికి “మీరేమీ గెలవలేదని బాధపడకండి. కనీసం “టాస్‌” గెలిచారు కదా!” అన్నాడు.

First Published:  11 May 2015 1:17 PM GMT
Next Story