Telugu Global
Others

సాఫ్ట్‌వేర్ నేరాల్లో యువ‌తే అధికం!

సైబర్‌ నేరాల్లో అగ్రభాగం యువత పోషిస్తున్నారా? సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు లేని వారు టెక్నిక్స్‌ నేర్చుకుని నేరాలు చేస్తున్నారా? అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. సైబర్‌ క్రైం పోలీసులు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో 15 రకాల మోసాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేరాల్లో 36 కేసులను నమోదు చేసి 15 మందిని అరెస్టు చేశారు. వారంతా 30-35ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఇతర ఈ నేరాల్లోనూ […]

సైబర్‌ నేరాల్లో అగ్రభాగం యువత పోషిస్తున్నారా? సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు లేని వారు టెక్నిక్స్‌ నేర్చుకుని నేరాలు చేస్తున్నారా? అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. సైబర్‌ క్రైం పోలీసులు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో 15 రకాల మోసాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేరాల్లో 36 కేసులను నమోదు చేసి 15 మందిని అరెస్టు చేశారు. వారంతా 30-35ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఇతర ఈ నేరాల్లోనూ యువకులే నిందితులుగా ఉంటున్నారని చెబుతున్నారు.
పోలీసులకు చిక్కిన నిందితులు 15 మందిలో పది మంది మాత్రం ముందుగా సైబర్‌ నేరగాళ్లకు సహాయకులుగా పనిచేశారు. ఒకవిధంగా వారే ఏజెంట్లు అన్నమాట. ఏడాదిపాటు నేరగాళ్ల వద్ద పనిచేసిన తర్వాత తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరుగా రంగంలోకి దిగి రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి నేరాలు చేయడం మొదలుపెట్టారు. సైబర్‌ నేరగాళ్లకు బ్యాంక్‌ ఖాతాలను సమకూర్చుతున్నదీ యువకులేనని సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. ‘‘ఆన్‌లైన్‌లో మోసాలు చేయడమే కాదు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటా డూప్లికేట్‌ చేయడంలోనూ యువతే ఎక్కువగా ఉంటున్నారు’’ అని సైబర్‌ క్రైం విభాగానికి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు.
Next Story