Telugu Global
Others

మెద‌క్ జిల్లాలో న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌

మెద‌క్ జిల్లా కొండాపూర్ మండ‌లం మ‌ల్కాపూర్‌లో ఇద్ద‌రు కూతుళ్ళ‌తో స‌హా దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఎన్ని రోజులైందో తెలీదు కాని మ‌ల్కాపూర్‌లో నాలుగు  మృత‌దేహాలున్న‌ట్టు స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన‌వార‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. మృతుల్లో భార్య‌భ‌ర్త‌ల‌తోపాటు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. వీరిని రాజు, అనిత‌, ఉమ‌, అమ‌ల‌లుగా గుర్తించారు. ముందుగా వీరెవ‌ర‌న్న‌ది తెలియ‌లేదు. ఈ మృత‌దేహాల్లో ఒకే ఒక్క‌రు పురుషుడు ఉండ‌డంతో వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటార‌ని […]

మెద‌క్ జిల్లా కొండాపూర్ మండ‌లం మ‌ల్కాపూర్‌లో ఇద్ద‌రు కూతుళ్ళ‌తో స‌హా దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఎన్ని రోజులైందో తెలీదు కాని మ‌ల్కాపూర్‌లో నాలుగు మృత‌దేహాలున్న‌ట్టు స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన‌వార‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. మృతుల్లో భార్య‌భ‌ర్త‌ల‌తోపాటు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. వీరిని రాజు, అనిత‌, ఉమ‌, అమ‌ల‌లుగా గుర్తించారు. ముందుగా వీరెవ‌ర‌న్న‌ది తెలియ‌లేదు. ఈ మృత‌దేహాల్లో ఒకే ఒక్క‌రు పురుషుడు ఉండ‌డంతో వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటార‌ని భావించారు. ఆత్మ‌హ‌త్య‌కు ఆర్థిక ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అక్క‌డున్న ప‌రిస్థితిని చూస్తే వీరంతా విషం తాగి మ‌ర‌ణించి ఉంటార‌ని భావిస్తున్నారు. వీరంతా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌మ‌లుద్దీన్‌పూర్‌కు చెందిన‌వారుగా భావిస్తున్నారు.
First Published:  10 May 2015 5:30 PM GMT
Next Story