Telugu Global
Others

పాత‌బ‌స్తీలో డబ్లూడబ్ల్యూఎఫ్‌ తరహా పోరాటం... ఓ యువ‌కుడు బలి!

ఒకటి, రెండు, మూడు… ఇలా వరుసగా ఇరవై గుద్దులు! ఛాతీమీద, పక్కటెముకల్లో, ముఖంమీద! పిడుగుల వర్షం! ప్రత్యర్థి నిశ్చలంగా మారిపోయాడు! నిలువునా కూలిపోయాడు! ఇది… రింగ్‌లో జరిగిన బాక్సింగ్ ఫైట్ కాదు… నడివీధిలో ఆకతాయిల ‘ఫైటింగ్‌’. ఇద్దరు ప్రత్యర్థులు, మధ్యలో ‘రెఫరీ’, చుట్టూ కొందరు ‘ప్రేక్షకులు’! అందరూ చూస్తుండగా ఆ ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ ఫైట్‌లో నబీల్‌ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా పాతబస్తీలో ఈ తరహా పోటీలు జరుగుతున్నాయి. నబీల్‌ బైక్‌ పైనుంచి పడిపోయాడని, […]

ఒకటి, రెండు, మూడు… ఇలా వరుసగా ఇరవై గుద్దులు! ఛాతీమీద, పక్కటెముకల్లో, ముఖంమీద! పిడుగుల వర్షం! ప్రత్యర్థి నిశ్చలంగా మారిపోయాడు! నిలువునా కూలిపోయాడు! ఇది… రింగ్‌లో జరిగిన బాక్సింగ్ ఫైట్ కాదు… నడివీధిలో ఆకతాయిల ‘ఫైటింగ్‌’. ఇద్దరు ప్రత్యర్థులు, మధ్యలో ‘రెఫరీ’, చుట్టూ కొందరు ‘ప్రేక్షకులు’! అందరూ చూస్తుండగా ఆ ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ ఫైట్‌లో నబీల్‌ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా పాతబస్తీలో ఈ తరహా పోటీలు జరుగుతున్నాయి. నబీల్‌ బైక్‌ పైనుంచి పడిపోయాడని, దుర్రెషవ్వార్‌ ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని ఉమర్‌, అబూబకర్‌ అనే యువకులు మూడో తేదీ ఉదయం షబానా బేగంకు ఫోన్‌చేశారు. ఆమె వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. ముక్కులోనుంచి రక్తస్రావం కావడంతో నబీల్‌ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
ఈ విషయాన్ని షబానా బేగం దుబాయ్‌లో ఉన్న భర్త దస్తగిర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారమివ్వడంతో ఆయన 4వ తేదీన హైదరాబాద్‌ చేరుకున్నారు. అదేరోజు నబీల్‌ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒక్కగానొక్క కుమారుడు నబీల్‌ మరణం మహ్మద్‌ దస్తగిర్‌ను కలిచివేసింది. అదే సమయంలో మరణంపై అతడికి అనుమానాలు కలిగాయి. చుట్టుపక్కల వారితోపాటు నబీల్‌ స్నేహితులను కూడా అతడు వాకబు చేశాడు. దీనికి నబీల్‌ స్నేహితులు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో ఓ యువకుడు దస్తగిర్‌ వద్దకు వచ్చి అది రోడ్డు ప్రమాదం కాదని చెప్పాడు. దీంతో ఆయన 7వ తేదీన మీర్‌చౌక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచార‌ణ చేప‌ట్టారు. పొంతనలేని సమాధానలు చెబుతుండడంతో పోలీసులు వారి సెల్‌ఫోన్లను పరిశీలించగా అసలు ‘దృశ్యం’ బయటపడింది.స్ట్రీట్ ఫైట్‌లో నబీల్‌ మరణించిన సంగతి స్పష్టమైంది.
First Published:  9 May 2015 5:20 PM GMT
Next Story