తలసాని ఓ సన్నాసి: రేవంత్ విమర్శ
తలసాని ఒక సన్నాసి అని ఆయన అనుభవించిన పదవుల వెనుక టీడీపీ పెట్టుబడి, శ్రమ, రక్తం ఉందని దుయ్యబట్టారు. ‘ఆ సన్నాసికి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యేగా గెలిపించిన సైకిల్ పార్టీకి రాజీనామా చేయాలి. దమ్ముంటే టీడీపీని వీడి టీఆర్‌ఎస్ డొక్కు కారు ఎక్కి మళ్లీ గెలిచి తనకున్న బలమేంటో నిరూపించుకోవాలి’అని సవాల్ విసిరారు. తలసాని ఎంత బలమైన వాడో అంటూ ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు… టీడీపీలో చేరకముందు మోహన్‌బాబు సినిమా షూటింగ్‌ల వద్ద బౌన్సర్‌గా పని […]
BY Pragnadhar Reddy9 May 2015 8:35 PM GMT
Pragnadhar Reddy9 May 2015 8:35 PM GMT
తలసాని ఒక సన్నాసి అని ఆయన అనుభవించిన పదవుల వెనుక టీడీపీ పెట్టుబడి, శ్రమ, రక్తం ఉందని దుయ్యబట్టారు. ‘ఆ సన్నాసికి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యేగా గెలిపించిన సైకిల్ పార్టీకి రాజీనామా చేయాలి. దమ్ముంటే టీడీపీని వీడి టీఆర్‌ఎస్ డొక్కు కారు ఎక్కి మళ్లీ గెలిచి తనకున్న బలమేంటో నిరూపించుకోవాలి’అని సవాల్ విసిరారు. తలసాని ఎంత బలమైన వాడో అంటూ ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు… టీడీపీలో చేరకముందు మోహన్‌బాబు సినిమా షూటింగ్‌ల వద్ద బౌన్సర్‌గా పని చేసేవాడని, పచ్చగా ఉన్నచోట తిని, వెచ్చగా ఉన్న చోట పడుకునే స్వార్థపరుడని రేవంత్ అభివర్ణించారు. గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలందరిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ కేంద్రంగా తెలుగుదేశం నాయకులు విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును తలసాని విమర్శిస్తుంటే..తలసాని లక్ష్యంగా టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. తాజాగా టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి తలసానిపై ఈ విమర్శలు చేశారు. సనత్‌నగర్‌లో చంద్రబాబును, పవన్‌కల్యాణ్‌ను పోటీ చేయాలంటూ సవాల్ విసురుతున్న తలసానికి ఉప ఎన్నికలంటే భయం లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ ఎందుకు పోటీ చేయడని ప్రశ్నించారు.
Next Story