నీతూ అగర్వాల్‌పై దాడికి యత్నం...
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి నీతూ అగర్వాల్‌పై శిరివెళ్ళ పరిధిలో దాడి జరిగింది. ఎర్రచందనం కేసులో భాగంగా ఆదివారం నాడు రుద్రవరం పీఎస్‌లో సంతకం చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన నీతూ అగర్వాల్‌పై శిరివెళ్ళ దగ్గర నాగరాజు అనే వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో తనకు ప్రాణహానీ ఉందని, తనకు రక్షణ కల్పించాలని జిల్లాలోని శిరివెళ్ళ పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడికి యత్నించాడంటూ నాగరాజుపై ఫిర్యాదు చేసింది. నంద్యాల సబ్‌జైలులో నీతూకు నాగరాజు […]
BY Pragnadhar Reddy9 May 2015 2:00 PM GMT

X
Pragnadhar Reddy9 May 2015 2:00 PM GMT
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి నీతూ అగర్వాల్‌పై శిరివెళ్ళ పరిధిలో దాడి జరిగింది. ఎర్రచందనం కేసులో భాగంగా ఆదివారం నాడు రుద్రవరం పీఎస్‌లో సంతకం చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన నీతూ అగర్వాల్‌పై శిరివెళ్ళ దగ్గర నాగరాజు అనే వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో తనకు ప్రాణహానీ ఉందని, తనకు రక్షణ కల్పించాలని జిల్లాలోని శిరివెళ్ళ పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడికి యత్నించాడంటూ నాగరాజుపై ఫిర్యాదు చేసింది. నంద్యాల సబ్‌జైలులో నీతూకు నాగరాజు పరిచయమైనట్లు సమాచారం. అయితే నీతూ ఆరోపణలపై స్పందించిన నాగరాజు నంద్యాల సబ్ జైలులో నీతూ అగర్వాల్‌కు తాను వాటర్ బాటిల్స్ అందించే వాడినని, వాటికి డబ్బులు ఇవ్వమని మాత్రమే అడిగానని వివరణ ఇచ్చాడు. ఆమెపై తాను దాడి చెయ్యలేదని స్పష్టంపై చేశారు. నీతూ తనపై అనవసర ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Next Story