3 రోజుల్లో రూ.6400 కోట్లు స్వాహా!
తూర్పు యూరప్‌లో మోల్డోవా ఒక పేద దేశం. ఈ దేశానికి చెందిన 28 సంవత్సరాల ఐలాన్ షోర్ మూడంటే మూడు రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడు బ్యాంకుల నుంచి 100 కోట్ల డాలర్లు (సుమారు 6,400 కోట్ల రూపాయలు) స్వాహా చేసేశాడు. విశేషమేమిటంటే షోర్ ఎలా కొట్టేశాడో ఆ దేశ కేంద్ర బ్యాంకుకే అర్ధం కాలేదు. దీంతో ప్రఖ్యాత ఆర్థిక విచారణా కన్సెల్టెన్సీ క్రోల్ సాయం తీసుకుంది. షోర్ మోసం చేసిన తీరును క్రోల్ నివేదిక […]
BY Pragnadhar Reddy9 May 2015 9:31 PM GMT

X
Pragnadhar Reddy9 May 2015 9:31 PM GMT
తూర్పు యూరప్‌లో మోల్డోవా ఒక పేద దేశం. ఈ దేశానికి చెందిన 28 సంవత్సరాల ఐలాన్ షోర్ మూడంటే మూడు రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడు బ్యాంకుల నుంచి 100 కోట్ల డాలర్లు (సుమారు 6,400 కోట్ల రూపాయలు) స్వాహా చేసేశాడు. విశేషమేమిటంటే షోర్ ఎలా కొట్టేశాడో ఆ దేశ కేంద్ర బ్యాంకుకే అర్ధం కాలేదు. దీంతో ప్రఖ్యాత ఆర్థిక విచారణా కన్సెల్టెన్సీ క్రోల్ సాయం తీసుకుంది. షోర్ మోసం చేసిన తీరును క్రోల్ నివేదిక రూపంలో అందించింది. క్రోల్ నివేదిక ప్రకారం షోర్, అతని సహాయకులు మోల్డోవాలోని మూడు బ్యాంకుల్లో కంట్రోలింగ్ వాటా కొనుగోలు చేశారు. అనంతరం క్రమంగా బ్యాంకుల లిక్విడిటీని పెంచేలా పలు సంక్లిష్టమైన లావాదేవీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విదేశీ కంపెనీలకు రుణాలు ఇప్పించారు. ఈ కంపెనీలన్నింటిలో షోర్‌కు వాటాలున్నాయని క్రోల్ పేర్కొంది. చివరకు కేవలం మూడంటే మూడు రోజుల్లో దాదాపు 100 కోట్ల డాలర్ల సొమ్ము ఈ సంక్లిష్ట లావాదేవీల్లో మాయం చేశారు. దీంతో ఉలిక్కి పడిన బ్యాంకులు వెంటనే కేంద్ర బ్యాంక్‌కు సమాచారం అందించాయి. దీంతో ముందు తక్షణ చర్యల కింద కేంద్ర బ్యాంకు ఆ మూడు బ్యాంకులకు 100 కోట్ల డాలర్ల మొత్తాన్ని బెయిల్ ఔట్ కింద ప్రకటించింది. అనంతరం ఈ మొత్తం లావాదేవీలపై విచారణ బాధ్యతను క్రోల్‌కు అప్పగించింది. ఈ మోసాన్ని నిరూపించడం చాలా కష్టమని, చాలా డేటా డిలీట్ చేశారని, రికార్డులు తీసుకుపోతున్న వ్యాన్ తగలబెట్టారని క్రోల్ తన నివేదికలో తెలిపింది. పూర్తి స్థాయి ఫోరెన్సిక్ విచారణ చేపడితేనే నిజానిజాలు బయటపడతాయని పేర్కొంది. ప్రస్తుతానికి షోర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తానే తప్పుచేయలేదని. పద్ధతి ప్రకారమే చేశానని షోర్ చెబుతున్నాడు. షోర్ కాజేసిన మొత్తం మోల్డోవా జిడిపిలో 12 శాతానికి సమానం!
Next Story