సిగరెట్ అప్పు ఇవ్వలేదని హత్య!
మచిలీపట్నం: జిల్లాలోని వీరులపాడు గ్రామంలో సిగరెట్ కోసం హత్య జరిగింది. కిరాణా దుకాణం యజమాని నరసింహారావు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఆగ్రహించిన సుధాకర్ అనే వ్యక్తి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక 70 ఏళ్ల వృద్ధుడు నరసింహారావు కుప్పకూలిపోయారు. నరసింహారావుకు డబ్బులివ్వకుండా అప్పు పేరుతో ఆయన దుకాణం నుంచి సుధాకర్ తరచుగా సిగరెట్లు తీసుకునేవాడు. కాగా, ఈసారి పాత బాకీ తీరిస్తే తప్ప సిగరెట్లు ఇచ్చేది లేదని నరసింహారావు గట్టిగా చెప్పడంతో అసలే మద్యం […]
BY Pragnadhar Reddy9 May 2015 2:10 PM GMT
Pragnadhar Reddy9 May 2015 2:10 PM GMT
మచిలీపట్నం: జిల్లాలోని వీరులపాడు గ్రామంలో సిగరెట్ కోసం హత్య జరిగింది. కిరాణా దుకాణం యజమాని నరసింహారావు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఆగ్రహించిన సుధాకర్ అనే వ్యక్తి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక 70 ఏళ్ల వృద్ధుడు నరసింహారావు కుప్పకూలిపోయారు. నరసింహారావుకు డబ్బులివ్వకుండా అప్పు పేరుతో ఆయన దుకాణం నుంచి సుధాకర్ తరచుగా సిగరెట్లు తీసుకునేవాడు. కాగా, ఈసారి పాత బాకీ తీరిస్తే తప్ప సిగరెట్లు ఇచ్చేది లేదని నరసింహారావు గట్టిగా చెప్పడంతో అసలే మద్యం మత్తులో ఉన్న సుధాకర్ రెచ్చిపోయాడు. వెంటనే ఆయనపై దాడికి పాల్పడి చితకబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక నరసింహరావు మరణించాడు. ఊహించని పరిణామంతో కంగు తిన్న స్థానికులు వెంటనే సుధాకర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనిని స్టేషన్‌కు తరలించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story