బిడ్డలతో బిచ్చమెత్తే మహిళలకు డీఎన్‌ఏ పరీక్ష
చంకలో పిల్లలను ఎత్తుకుని అడుక్కునే మహిళలకు, ఆ బాలలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. చిన్నారుల అక్రమ రవాణపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రలోభాలకు గురిచేయడం.. లేదంటే దుర్భర పేదరికం వల్ల తల్లిదండ్రులు పిల్లలను అమ్ముకోవడం జరుగుతుంది. తర్వాత కొన్ని ముఠాలు వారిని డబ్బు సంపాదన కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొన్నిసార్లు ఆ పిల్లలకు వైకల్యం వచ్చేట్టుగా చేస్తున్నాయి. ఇది గమనించిన ప్రభుత్వం బిడ్డలతోపాటు వారి చంకలో […]
BY Pragnadhar Reddy10 May 2015 9:02 AM GMT
Pragnadhar Reddy10 May 2015 9:02 AM GMT
చంకలో పిల్లలను ఎత్తుకుని అడుక్కునే మహిళలకు, ఆ బాలలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. చిన్నారుల అక్రమ రవాణపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రలోభాలకు గురిచేయడం.. లేదంటే దుర్భర పేదరికం వల్ల తల్లిదండ్రులు పిల్లలను అమ్ముకోవడం జరుగుతుంది. తర్వాత కొన్ని ముఠాలు వారిని డబ్బు సంపాదన కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొన్నిసార్లు ఆ పిల్లలకు వైకల్యం వచ్చేట్టుగా చేస్తున్నాయి. ఇది గమనించిన ప్రభుత్వం బిడ్డలతోపాటు వారి చంకలో ఉండి అడుక్కోవడానికి రోడ్లపై తిరుగుతున్న బిచ్చగత్తెలకు కూడా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. పిల్లలను ఎత్తుకొని తిరిగే బిచ్చగత్తెలంతా.. ఆ పిల్లలకు తల్లులు కాదనే అనుమానం వ్యక్తం అవుతోందని, పిల్లలకు డ్రగ్స్ ఇచ్చి నిద్రపోయేలా చేసి అడుక్కుంటారని ఆయన పేర్కొన్నారు. దీన్ని దేశమంతా అమలు చేస్తే చాలామంది పిల్లలకు న్యాయం జరిగే అవకాశం ఉంది.
Next Story