చార్మీకి అంత సీనుందా?
2002లో నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది చార్మీ. బొద్దుగా ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మని మొదట్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కృష్ణవంశీ శ్రీ ఆంజనేయంతో ఈ అమ్మడి స్టార్ తిరిగింది. రవితేజ, ప్రభాస్, శ్రీకాంత్ వంటి అగ్రహీరోల సరసన నటించింది. లావెక్కడంతో అవకాశాలు క్రమంగా దూరమయ్యాయి. పెద్ద ప్రాజెక్టులు దూరమవడంతో ఇండస్ట్రీలో ఇక చార్మీ పని అయిపోయిందనుకున్న టైంలో 2007లో విడుదలైన మంత్ర సినిమా సూపర్ హిట్ అయి వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. కానీ, […]
BY Pragnadhar Reddy9 May 2015 9:20 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 9 May 2015 9:20 PM GMT
2002లో నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది చార్మీ. బొద్దుగా ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మని మొదట్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కృష్ణవంశీ శ్రీ ఆంజనేయంతో ఈ అమ్మడి స్టార్ తిరిగింది. రవితేజ, ప్రభాస్, శ్రీకాంత్ వంటి అగ్రహీరోల సరసన నటించింది. లావెక్కడంతో అవకాశాలు క్రమంగా దూరమయ్యాయి. పెద్ద ప్రాజెక్టులు దూరమవడంతో ఇండస్ట్రీలో ఇక చార్మీ పని అయిపోయిందనుకున్న టైంలో 2007లో విడుదలైన మంత్ర సినిమా సూపర్ హిట్ అయి వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. కానీ, అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. అయినప్పటికీ ఈ బొద్దుగుమ్మ ఇండస్ట్రీని వీడలేదు. ఐటెం సాంగ్‌లతో కాలం నెట్టుకు వస్తోంది. ఎలాగైనా హీరోయిన్‌గా నిలబడటానికి నానా తంటాలు పడుతున్న చార్మీ మరోసారి పాత మంత్రాన్నే నమ్ముకుంది. ఈసారి మంత్ర-2గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇంతకీ ఈసారి చార్మీకి అంత సీనుందా? లేదా అన్నది.. త్వరలోనే తేలనుంది.
Next Story