భుజాలపై తుపాకులు కాదు... నాగళ్లు ఉంటేనే అభివృద్ధి : ప‌్రధాని మోడీ
‘‘మీరు చేసిన హింసలో ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారాయి కదా! ఆ బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లండి. ఐదు రోజులు వారితో కలిసి ఉండండి. కానీ, మీరు ఎవరో మాత్రం వారితో చెప్పకండి. వారితో మాట్లాడండి. కష్టసుఖాలు పంచుకోండి. నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను.. వారితో మాట్లాడిన తర్వాత.. వారి అనుభవాలు విన్న తర్వాత, మీరు పునరాలోచనలో పడతారు. హింస ద్వారా మేం ఎంత పెద్ద పాపం చేశాం అని తీవ్ర మనో వ్యథకు గురవుతారు. మరోసారి […]
BY Pragnadhar Reddy9 May 2015 9:52 PM GMT

X
Pragnadhar Reddy9 May 2015 9:52 PM GMT
‘‘మీరు చేసిన హింసలో ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారాయి కదా! ఆ బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లండి. ఐదు రోజులు వారితో కలిసి ఉండండి. కానీ, మీరు ఎవరో మాత్రం వారితో చెప్పకండి. వారితో మాట్లాడండి. కష్టసుఖాలు పంచుకోండి. నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను.. వారితో మాట్లాడిన తర్వాత.. వారి అనుభవాలు విన్న తర్వాత, మీరు పునరాలోచనలో పడతారు. హింస ద్వారా మేం ఎంత పెద్ద పాపం చేశాం అని తీవ్ర మనో వ్యథకు గురవుతారు. మరోసారి హింసామార్గంలోకి వెళ్లరు. తప్పు చేశామని భావిస్తారు. ప్రభుత్వం.. చట్టం.. ప్రలోభాలు.. ఇవేవీ మిమ్మల్ని మార్చలేకపోవచ్చు. కానీ, మీ తుపాకీ గుళ్లకు బలయిన ఆ బాధిత కుటుంబాలు మాత్రం తప్పకుండా మిమ్మల్ని మారుస్తాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ మావోయిస్టులనుద్దేశించి వ్యాఖ్యానించారు. నక్సలైట్లు ఈ ఒక్క ప్రయోగం చేయాలంటూ ఆయన వారికి సూచించారు. మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సుకుమా జిల్లాలోని మొరెంగా గ్రామం నుంచి శుక్రవారం రాత్రి భారీ సంఖ్యలో మావోయిస్టులు గ్రామస్థులను అపహరించుకు పోయినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం మావోయిస్టుల కంచుకోట! 1985లో ఒకసారి రాజీవ్ గాంధీ ప్రధానిగా అక్కడికి వెళ్లారు. తుపాకుల హోరు వినిపిస్తున్నా మూడు దశాబ్దాలుగా ఏ ప్రధాన మంత్రీ అక్కడ అడుగు పెట్టలేదు! తొలిసారిగా, ప్రధాని మోదీ శనివారం బస్తర్ ప్రాంతంలో పర్యటించారు. దాదాపు 20 కిలోమీటర్లు ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించారు. రోజంతా ఈ ప్రాంతంలోనే గడిపా రు. రూ.24 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో అల్ట్రా మెగా స్టీల్ ప్లాంట్‌తోపాటు రైల్వే లైను, మురుగునీటి పైప్‌లైను, పెల్లెట్ ప్లాంట్ తదితరాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. హింసా మార్గాన్ని ఎంచుకున్న కొంతమంది పిచ్చివాళ్ల కారణంగా ఎంతోమంది చనిపోయారని మావోయిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భుజాలపై తుపాకులు కాకుండా నాగళ్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హింసకు భవిష్యత్తు లేదని, భవిష్యత్తు అంతా శాంతియుత కార్యక్రమాలదేనని చెప్పారు. తుపాకులను విడిచిపెట్టిన తర్వాత పంజాబ్, పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరిలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని మోదీ ప్రస్తావించారు. మావోయిస్టు సమస్య అంతమైతే ఆర్థికాభివృద్ధిలో ఛత్తీస్‌గఢ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతుందన్నారు.
Next Story