Telugu Global
Others

మామాట వింటే ఆర్టీసీ లాభాల బాటే: టీఎంయూ

త‌మ సూచ‌న‌లు అమ‌లు చేస్తే ఛార్జీలు పెంచ‌కుండా న‌ష్టాల‌ను అధిగ‌మించే అవ‌కాశం ఉంద‌ని టీఎంయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అశ్వ‌ర్థామ‌రెడ్డి అన్నారు. స‌మ్మెను ప‌రిష్కరించాల‌న్న చిత్త‌శుద్ధి మంత్రుల్లోగాని, ఆర్టీసీ ఎండీ సాంబ‌శివ‌రావుకి గాని లేవ‌ని ఆయ‌న ఆరోపించారు. ఆర్టీసీకి న‌ష్టాలు వ‌చ్చేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, స‌మ్మె ఎక్కువ రోజులు కొన‌సాగితే బ‌ద్నామ్ అయ్యేది ప్ర‌భుత్వ‌మేన‌ని అశ్వ‌ర్ధామ‌రెడ్డి అన్నారు. సంస్థ‌ను నిర్వీర్యం చేయ‌డానికే ప్ర‌భుత్వ ఎత్తుగ‌డ అని ఆయ‌న అన్నారు. త‌మ డిమాండ్ల‌పై నీటిపారుద‌ల మంత్రి హ‌రీష్‌రావుకు సానుభూతి ఉంద‌ని, […]

త‌మ సూచ‌న‌లు అమ‌లు చేస్తే ఛార్జీలు పెంచ‌కుండా న‌ష్టాల‌ను అధిగ‌మించే అవ‌కాశం ఉంద‌ని టీఎంయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అశ్వ‌ర్థామ‌రెడ్డి అన్నారు. స‌మ్మెను ప‌రిష్కరించాల‌న్న చిత్త‌శుద్ధి మంత్రుల్లోగాని, ఆర్టీసీ ఎండీ సాంబ‌శివ‌రావుకి గాని లేవ‌ని ఆయ‌న ఆరోపించారు. ఆర్టీసీకి న‌ష్టాలు వ‌చ్చేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, స‌మ్మె ఎక్కువ రోజులు కొన‌సాగితే బ‌ద్నామ్ అయ్యేది ప్ర‌భుత్వ‌మేన‌ని అశ్వ‌ర్ధామ‌రెడ్డి అన్నారు. సంస్థ‌ను నిర్వీర్యం చేయ‌డానికే ప్ర‌భుత్వ ఎత్తుగ‌డ అని ఆయ‌న అన్నారు. త‌మ డిమాండ్ల‌పై నీటిపారుద‌ల మంత్రి హ‌రీష్‌రావుకు సానుభూతి ఉంద‌ని, వేత‌నాలు పెంచాల్సిందేన‌ని ఆయ‌న కూడా అంటున్నార‌ని అశ్వ‌ర్ధామ చెప్పారు. త‌మ స‌మ్మెకు మంత్రి మ‌ద్ద‌తిస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పెట్టిన కేసుల్ని ఎత్తివేసి చ‌ర్చ‌లకు పిలిస్తే రావ‌డానికి త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, అయితే ఎండీ సాంబ‌శివ‌రావుతో తాము చ‌ర్చ‌లు జ‌ర‌ప‌బోమ‌ని ఆయ‌న తెగేసి చెప్పారు. స‌మ్మె ప‌రిష్కారం కాక‌పోతే దీన్ని మ‌రింత ఉధృతం చే్స్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. శ‌నివారం డిపోల వద్ద వంటావార్పూ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నామ‌ని, ఆదివారం స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తామ‌ని, ఎల్లుండి ర్యాలీలు నిర్వ‌హించి తాసిల్దార్ల‌కు, క‌లెక్ట‌ర్ల‌కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తామ‌ని అశ్వ‌ర్థామ‌రెడ్డి తెలిపారు.
Next Story