Telugu Global
Others

ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం... తిరుమలకూ బస్సులు నిలిపివేత

ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సమ్మె నాలుగో రోజుకు చేరడంతో ఇవాళ అన్ని డిపోల వద్ద కార్మికులు వంటా వార్పు చేయ‌డం ప్రారంభించారు. సమ్మెలో భాగంగా తిరుమలకు వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. చిత్తూరులో కార్మికులపై లాఠీచార్జికు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకుంటామని కార్మికసంఘాలు ప్రకటించాయి. విజయవాడలో జరిగిన రాజకీయ పార్టీల ఐక్యవేదిక, కార్మిక […]

ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సమ్మె నాలుగో రోజుకు చేరడంతో ఇవాళ అన్ని డిపోల వద్ద కార్మికులు వంటా వార్పు చేయ‌డం ప్రారంభించారు. సమ్మెలో భాగంగా తిరుమలకు వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. చిత్తూరులో కార్మికులపై లాఠీచార్జికు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకుంటామని కార్మికసంఘాలు ప్రకటించాయి. విజయవాడలో జరిగిన రాజకీయ పార్టీల ఐక్యవేదిక, కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బంది సాయంతో సమ్మెను విచ్ఛినం చేసేందుకు కుట్ర జరుగుతోందని రాజకీయ నేతలు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కార్మిక సంఘాల పోరాటానికి విపక్ష పార్టీలు ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీల‌తోపాటు కాంగ్రెస్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎస్మా ప్రయోగిస్తే ఎంతకైనా తెగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ తేల్చి చెప్పింది. నేటి నుంచి బస్సులు తిరిగితే అడ్డుకుంటామని చెప్పారు.
Next Story