Telugu Global
Others

నేర్చుకుని... నేర్పుదామ‌ని ఎంసెట్ రాసిన డాక్టర్

వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ తన కుమార్తెను ఈ పరీక్షకు సిద్ధం చెయ్యడం కోసం తాను ఎంసెట్ పరీక్ష రాసి సంచలనం సృష్టించారు. మ‌చిలీప‌ట్నంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వాడ్రేవు భాస్కర్ ఇక్కడి హిందూ కళాశాలలో ఎంసెట్ మెడిసిన్ పరీక్ష రాశారు. డాక్టర్‌గా ఉంటూ 50 ఏళ్ల వయసుకు చేరుకున్న తరువాత కూడా ఆయన ఈ పరీక్ష రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ వచ్చే […]

వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ తన కుమార్తెను ఈ పరీక్షకు సిద్ధం చెయ్యడం కోసం తాను ఎంసెట్ పరీక్ష రాసి సంచలనం సృష్టించారు. మ‌చిలీప‌ట్నంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వాడ్రేవు భాస్కర్ ఇక్కడి హిందూ కళాశాలలో ఎంసెట్ మెడిసిన్ పరీక్ష రాశారు. డాక్టర్‌గా ఉంటూ 50 ఏళ్ల వయసుకు చేరుకున్న తరువాత కూడా ఆయన ఈ పరీక్ష రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తన కుమార్తెతో ఎంసెట్ పరీక్ష రాయించాల్సి ఉంద‌ని, మెడికల్ సీటు కోసం తాను కొన్నేళ్ల కిందట రాసిన ప్రవేశ పరీక్షకు, ఇప్పటి ఎంసెట్ పరీక్షకు గల తేడా తెలుసుకుని కుమార్తెను సిద్ధం చెయ్యడం కోసమే ఈ పరీక్ష రాశానన్నారు. కుమార్తెను వైద్యవృత్తిలోకి తీసుకురావడం కోసం ఆ తండ్రి పడుతున్న తపన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Next Story