Telugu Global
Others

వారంలో అమరావతి కమిషనరేట్‌.. 

నవ్యాంధ్ర రాజధాని పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సంబంధిత ఫైల్‌పై హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే సంతకం చేశారు. రేపో మాపో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫైల్‌పై సంతకం చేయడమే మిగిలి ఉంది. సీఎం ఆమోదముద్ర వేస్తే  మరో వారం రోజుల్లో పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటుపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. గుంటూరు అర్బన్‌ జిల్లా, గుంటూరు రూరల్‌లోని కొంతభాగం, విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌, కృష్ణా జిల్లాలోని కొంత భాగం కలుపుకుని సీఆర్‌డీఏ పరిధి వరకు ఈ కమిషనరేట్‌ […]

నవ్యాంధ్ర రాజధాని పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సంబంధిత ఫైల్‌పై హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే సంతకం చేశారు. రేపో మాపో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫైల్‌పై సంతకం చేయడమే మిగిలి ఉంది. సీఎం ఆమోదముద్ర వేస్తే మరో వారం రోజుల్లో పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటుపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. గుంటూరు అర్బన్‌ జిల్లా, గుంటూరు రూరల్‌లోని కొంతభాగం, విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌, కృష్ణా జిల్లాలోని కొంత భాగం కలుపుకుని సీఆర్‌డీఏ పరిధి వరకు ఈ కమిషనరేట్‌ ఏర్పాటు చేస్తున్నారు. రెండు జిల్లాల్లోని 82 పోలీస్‌ స్టేషన్లు ఈ కమిషనరేట్‌ పరిధిలోకి వస్తాయి. అడిషనల్‌ డీజీ స్థాయి అధికారి నేతృత్వం వహించే ఈ కమిషనరేట్‌లో ముగ్గురు ఐజీలు, నలుగురు డీఐజీలు, తొమ్మిది మంది ఎస్‌పీ స్థాయి అధికారులు ఉండాలని చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. ప్రస్తుత పోలీస్‌ స్టేషన్లు అన్నీ యథావిధిగానే ఉంటున్నప్పటికి వీటిస్థాయిని పెంచుతారు. దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్‌గా అమరావతి ఆవిర్భవించనుంది. తొలుత గుంటూరు, విజయవాడ, పరిసర మండలాల వరకే కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. కానీ సీఆర్‌డీఏ పరిధి వరకు కమిషనరేట్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడంతో 7 వేల 500 చదరపు కిలోమీటర్లు పరిధిలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
Next Story