నివాసం ఉన్న చోటే ఓటు హక్కు: భన్వర్
భవిష్యత్తులో ఎవరికైనా నివాసం ఉంటున్న చోట మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఓటర్ల జాబితాతో ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వివరాల అనుసంధానం వల్ల ఎవరికైనా ఒక్కచోట మాత్రమే ఓటు ఉంటుందన్నారు. ఆధార్‌తో అనుసంధానంపై విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. చిరునామా ఇచ్చిన చోట ఓటరు నివాసం ఉంటున్నారా లేదా అన్నది బూత్ లెవెల్ అధికారులు(బీఎల్‌వో) తనిఖీ చేస్తారన్నారు. అక్కడ ఓటరు […]
BY Pragnadhar Reddy7 May 2015 7:27 AM GMT
Pragnadhar Reddy7 May 2015 7:27 AM GMT
భవిష్యత్తులో ఎవరికైనా నివాసం ఉంటున్న చోట మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఓటర్ల జాబితాతో ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వివరాల అనుసంధానం వల్ల ఎవరికైనా ఒక్కచోట మాత్రమే ఓటు ఉంటుందన్నారు. ఆధార్‌తో అనుసంధానంపై విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. చిరునామా ఇచ్చిన చోట ఓటరు నివాసం ఉంటున్నారా లేదా అన్నది బూత్ లెవెల్ అధికారులు(బీఎల్‌వో) తనిఖీ చేస్తారన్నారు. అక్కడ ఓటరు లేనట్టు తేలితే, జాబితా నుంచి పేర్లను తొలగిస్తారన్నారు.
Next Story