లెంపలేసుకుంటున్న రాహుల్:!
హైదరాబాద్ : చేతులు కాలాక అకులు పట్టుకోవడం అనే సామెత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సరిగ్గా సరిపోతుందని కాంగ్రెస్ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో తన పాత్ర ఎంతో ఉందని ఆ తప్పు తనదేనని ఇపుడు లెంపలేసుకుంటున్నారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్. పార్టీ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య స్థానంలో నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంలో కీలక పాత్రను పోషించానని, ఆ నిర్ణయం తనదేనని రాహుల్ అంగీకరించారు. ఈ […]
BY Pragnadhar Reddy6 May 2015 9:11 PM GMT

X
Pragnadhar Reddy6 May 2015 9:11 PM GMT
హైదరాబాద్ : చేతులు కాలాక అకులు పట్టుకోవడం అనే సామెత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సరిగ్గా సరిపోతుందని కాంగ్రెస్ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో తన పాత్ర ఎంతో ఉందని ఆ తప్పు తనదేనని ఇపుడు లెంపలేసుకుంటున్నారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్. పార్టీ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య స్థానంలో నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంలో కీలక పాత్రను పోషించానని, ఆ నిర్ణయం తనదేనని రాహుల్ అంగీకరించారు. ఈ తప్పిదానికి పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, ఏపీలో కాంగ్రెస్ కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన రాష్ట్ర నేతల వద్ద రాజకీయ పరిణామాలపై చర్చించిన రాహుల్.. రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం స్థానంలో కూర్చోబెట్టినందుకు ఇప్పుడు బాధపడ్డారు. రాష్ట్ర నేతల మాటలు విని కిరణ్‌ను సీఎం బాధ్యతల నుంచి తప్పించి ఉంటే.. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండి ఉండేది కాదని రాహుల్ అన్నట్లు నేతలు చెప్పుకొచ్చారు.
Next Story