Telugu Global
Others

అక్రమ పత్రాలతో కాలేజీకి అనుమతి... టీడీపీ ఎమ్మెల్యేపై కేసు

హైద‌రాబాద్: అక్ర‌మంగా బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం నిర్మిస్తున్నందుకు… అక్క‌డ నుంచి కాలేజీ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తులు సాధించ‌డంలో ఫోర్జ‌రీ డాక్యుమెంట్ల‌ను సృష్టించినందుకు ఓ జీహెచ్ఎంసీ రిటైర్డ్ అధికారితోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌పైన మ‌రో ముగ్గురిపైన కేసులు న‌మోదు చేయాల్సిందిగా స్థానిక కోర్టు జీడిమెట్ల పోలీసుల‌ను ఆదేశించింది. విశాల్ గౌడ్ అనే జీడిమెట్ల నివాసి వేసిన ఓ ప్ర‌యివేటు పిటిష‌న్‌ను ఆధారం చేసుకుని మేడ్చెల్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. భ‌వ‌నం యాజ‌మాని, మాజీ కార్పొరేట‌ర్ […]

ALAPATI-RAJENDRA-PRASADహైద‌రాబాద్: అక్ర‌మంగా బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం నిర్మిస్తున్నందుకు… అక్క‌డ నుంచి కాలేజీ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తులు సాధించ‌డంలో ఫోర్జ‌రీ డాక్యుమెంట్ల‌ను సృష్టించినందుకు ఓ జీహెచ్ఎంసీ రిటైర్డ్ అధికారితోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌పైన మ‌రో ముగ్గురిపైన కేసులు న‌మోదు చేయాల్సిందిగా స్థానిక కోర్టు జీడిమెట్ల పోలీసుల‌ను ఆదేశించింది. విశాల్ గౌడ్ అనే జీడిమెట్ల నివాసి వేసిన ఓ ప్ర‌యివేటు పిటిష‌న్‌ను ఆధారం చేసుకుని మేడ్చెల్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. భ‌వ‌నం యాజ‌మాని, మాజీ కార్పొరేట‌ర్ కె.ఎం.గౌరిష్ అత‌ని కుమారుడు విద్యాధ‌ర్‌, ఎన్ఆర్ఐ కాలేజీ క‌ర‌స్పాండెంట్‌గా చెప్పుకుంటున్న‌ ఎమ్మెల్యే ఏ. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఈ కాలేజీ ప్ర‌తినిధి శ్రీ‌ధ‌ర్‌తోపాటు జీహెచ్ఎంసీ మాజీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ అన్న‌పూర్ణ‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. నిజానికి గౌరిష్‌కి జీ ప్ల‌స్ ఒన్ నిర్మాణానికే అనుమ‌తి ఉంద‌ని, దొంగ‌ప‌త్రాలు సృష్టించి మ‌రో మూడు అంత‌స్తులు అక్ర‌మంగా వేస్తున్నాడ‌ని, ఈ అక్ర‌మ ప‌త్రాల‌తో తెలుగుదేశం ఎమ్మెల్యే రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీ‌ధ‌ర్‌లు కాలేజీ నిర్వ‌హ‌ణ‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు నుంచి అనుమ‌తులు సంపాదించార‌ని, ఈ భ‌వ‌నం నుంచి కాలేజీ నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదంటూ జీహెచ్ఎంసీ మాజీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ అన్న‌పూర్ణ ఎన్ఓసీ ఇచ్చార‌ని, అందుకే వీరింద‌రిపై కేసును పెట్టాల్సి వ‌చ్చింద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కె.ఎల్.బి. కుమార్ తెలిపారు.
First Published:  6 May 2015 2:16 PM GMT
Next Story