జిల్లాకో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు
‘మీరు కావాల్సినంత చెత్తను ఇవ్వండి.. మేం దాని నుంచి విద్యుత్తును తీస్తాం. వ్యర్థాలతో దాదాపు 200 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ప్రాథమికంగా 150 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే వీలుంది. రాష్ట్ర అవసరాలకే ఈ విద్యుత్తును విక్రయిస్తాం.’ అని చెత్త నుంచి విద్యుదుత్పత్తిని చేసే సంస్థలు ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలుంచాయి. ఈ సంస్థలతో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ భేటీ అయ్యారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ప్రఖ్యాతిగాంచిన జిందాల్ […]
BY Pragnadhar Reddy7 May 2015 7:31 AM GMT
Pragnadhar Reddy7 May 2015 7:31 AM GMT
‘మీరు కావాల్సినంత చెత్తను ఇవ్వండి.. మేం దాని నుంచి విద్యుత్తును తీస్తాం. వ్యర్థాలతో దాదాపు 200 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ప్రాథమికంగా 150 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే వీలుంది. రాష్ట్ర అవసరాలకే ఈ విద్యుత్తును విక్రయిస్తాం.’ అని చెత్త నుంచి విద్యుదుత్పత్తిని చేసే సంస్థలు ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలుంచాయి. ఈ సంస్థలతో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ భేటీ అయ్యారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ప్రఖ్యాతిగాంచిన జిందాల్ కంపెనీతో సహా.. 30 జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో జిందాల్ ప్లాంట్‌ను బాబు బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ ఇలాంటి పరిశ్రమను స్థాపించాలని జిందాల్ యాజమాన్యాన్ని చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్లాంట్‌లను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే.. ఇందుకు తగినంతగా చెత్త ఇవ్వాల్సి ఉంటుందని పారిశ్రామికవేత్తలు అజయ్‌జైన్‌కు వివరించారు. వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్తును రాష్ట్రావసరాలకు వినియోగించేందుకు ఇస్తామని, అయితే.. దీనికి అనుగుణంగా పంపిణీ సరఫరా వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించారు. పారిశ్రామిక ప్రతినిధులు చేసిన సూచనలతో ఏకీభవించిన అజయ్‌జైన్ .. తక్కువధరకు కరెంటును అందించే సంస్థల నుంచి తప్పకుండా కొనుగోలు చేస్తామన్నారు.
Next Story