స్టాక్ మార్కెట్లు డమాల్
షేరు మార్కెట్లు బుధవారం అనూహ్యంగా నష్టపోయాయి. గత నెలలో నష్టాల బాటలోనే ఉన్న మార్కెట్లు కొంచెం లాభాల బాట పడతాయనుకున్న దశలో మళ్ళీ భారీగా నష్టపోయాయి. ఈరోజు ఒకేసారి 722 పాయింట్ల నష్టాలతో పెట్టుబడిదారుల్లో గుబులు రేపాయి. నిన్న 27,440 పాయింట్ల దగ్గర స్థిరపడిన బీఎస్సీ సెన్సెక్స్ ఈరోజు 26,717 వద్ద ముగిసింది. అంటే దాదాపు 722 పాయింట్లు నష్టపోయిందన్న మాట. వారం రోజుల నుంచి 27 వేల కిందకు సెన్సెక్స్ దిగిపోతుందని చెబుతున్నా అందరి అంచనాలను […]
BY Pragnadhar Reddy6 May 2015 7:16 AM GMT
Pragnadhar Reddy6 May 2015 7:16 AM GMT
షేరు మార్కెట్లు బుధవారం అనూహ్యంగా నష్టపోయాయి. గత నెలలో నష్టాల బాటలోనే ఉన్న మార్కెట్లు కొంచెం లాభాల బాట పడతాయనుకున్న దశలో మళ్ళీ భారీగా నష్టపోయాయి. ఈరోజు ఒకేసారి 722 పాయింట్ల నష్టాలతో పెట్టుబడిదారుల్లో గుబులు రేపాయి. నిన్న 27,440 పాయింట్ల దగ్గర స్థిరపడిన బీఎస్సీ సెన్సెక్స్ ఈరోజు 26,717 వద్ద ముగిసింది. అంటే దాదాపు 722 పాయింట్లు నష్టపోయిందన్న మాట. వారం రోజుల నుంచి 27 వేల కిందకు సెన్సెక్స్ దిగిపోతుందని చెబుతున్నా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సోమవారం పైకెగసింది. నిన్న ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్ళు చల్లుతూ 50 పాయింట్లు పతనమైంది. ఇక ఈరోజు అందరి అంచనాలను తలకిందు చేస్తూ 27 వేల స్థాయి కిందకు చేరడమే కాకుండా సెన్సెక్స్‌ను ప్రభావితం చేసే షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఒకే ఒక్క షేరు… భారతీ ఎయిర్‌టెల్ మాత్రం కొంచెం పెరిగి పెరిగాననిపించుకుంది. ఇక నిఫ్టీ కూడా 227 పాయింట్లు నష్టపోయి 8,097 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్, అజంతా ఫార్మా, పీవీఆర్ షేర్లు కొంచెం లాభాలతో ముగిసినప్పటికీ ఐసీఐసీఐ, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, సిప్లా భారీగా నష్టపోయాయి.
Next Story