బాబు ప్రసంగిస్తుండగానే రైతు ఆత్మహత్యాయత్నం!
నీరు చెట్టు కార్యక్రమంపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయనగరం జిల్లా నర్సీపట్నంలో బహిరంగసభలో ప్రసంగించారు. బాబు బహిరంగ సభ జరుగుతున్న సమయంలోనే అపశ్రుతి చోటు చేసుకుంది. రెవిన్యూ అధికారులు భూమి పత్రాల విషయంలో తనను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎన్నో నెలల నుంచి తన భూమి పత్రాలు తనకు ఇవ్వడంలో అనేక ఇబ్బందులపాలు చేస్తున్నారని […]
BY Pragnadhar Reddy6 May 2015 4:17 AM GMT
Pragnadhar Reddy6 May 2015 4:17 AM GMT
నీరు చెట్టు కార్యక్రమంపై అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయనగరం జిల్లా నర్సీపట్నంలో బహిరంగసభలో ప్రసంగించారు. బాబు బహిరంగ సభ జరుగుతున్న సమయంలోనే అపశ్రుతి చోటు చేసుకుంది. రెవిన్యూ అధికారులు భూమి పత్రాల విషయంలో తనను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎన్నో నెలల నుంచి తన భూమి పత్రాలు తనకు ఇవ్వడంలో అనేక ఇబ్బందులపాలు చేస్తున్నారని అతను ఆరోపించాడు. పురుగు మందు తాగిన రైతును గమనించిన జనం అధికారుల దృష్టికి తీసుకుపోగా వెంటనే వారు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెబుతున్నారు. తాను ప్రసంగిస్తుండగానే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యా యత్నం చేయడంపై చంద్రబాబు అధికారులను నిలదీశారు.
Next Story